ఛార్మీని వదలకపోతే మీ బతుకు బస్టాండే… ఓ పూరీ అభిమాని స్టేట్మెంట్!

టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి పరిచయం అక్కర్లేదు. మనకున్న తెలుగు దర్శకులలో టాలెంటెడ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ మన పూరి. ఇక ఈయన కెరియర్ ఆరంభంలోనే ఎన్నో అద్భుతమైన సినిమాలను తీసి సినిమా ప్రేక్షకులని మెస్మరైజ్ చేసారు. రాజమౌళి మరియు సుకుమార్ వంటి దర్శక దిగ్గజాలు కూడా ఈయనను అభిమాన దర్శకుడు అంటూ చెబుతారు అంటే అర్ధం చేసుకోండి ఇక. ఇతనిలో వున్న ఇంకో ప్రత్యేకత ఏమంటే… కేవలం రెండు మూడు నెలల్లోనే అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం.

అవును… ఒక సినిమాను ఇతర దర్శకులు చేయడానికి ఎంతో సమయం తీసుకుంటారు. కానీ దర్శకుడు పూరి జగన్నాథ్ మాత్రం సునాయాసంగా తన సినిమాలను తీసేస్తాడు. ముఖ్యంగా తన సినిమాలోని హీరోల యొక్క పాత్రలకు డైలాగ్స్ అప్పటికప్పుడు రాసి వావ్ అనిపిస్తాడు. అలాగే హీరో క్యారెక్టర్లు తీర్చిదిద్దడంలో పూరి మంచి దిట్ట. అలాంటి దర్శకుడు పూరి జగన్నాథ్ ఇప్పుడు గతమెంతో గణం అన్నట్లుగా మారిపోయాడు. అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి.

మధ్యలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా కాస్త పర్వాలేదు అనిపించినా తాజాగా వచ్చిన విజయ్ దేవరకొండ లైగర్ సినిమా దారుణమైన పరాజయాన్ని చూసింది. ఈ క్రమంలో ఈయనను ఎంతగానో ట్రోల్స్ చేస్తున్నారు. అలాగే పూరి జగన్నాథ్‌ అభిమానులు సోషల్ మీడియాలో చార్మిని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. చార్మి గత కొన్నాళ్లుగా పూరి జగన్నాథ్ యొక్క నిర్మాణ సంస్థ పనులను చక్కబెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో పూరి – ఛార్మి మధ్య గల సంబంధాన్ని కూడా కొంతమంది తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ నెటిజన్ ఛార్మిని ఉద్దేశించి “ఛార్మీని వదలకపోతే మీ బతుకు బస్టాండే!” అని సోషల్ మీడియాలో కామెంట్ చేసాడు. ఆ కామెంట్ కాస్త ఇపుడు వైరల్ అయింది.

Share post:

Latest