‘బింబిసార 2’ కథ బాహుబలిని మించి వుంటుందా?

ఇటీవల కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా అంచనాలకు మించి సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో ఇపుడు చర్చ అంతా సెకండ్ పార్ట్ గురించి నడుస్తోంది. కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆబాలగోపాలాన్ని అలరించే విధంగా బింబిసార1 ఉందని నెటిజన్ల నుంచి ప్రసంశలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో డైరెక్టర్ వశిష్ట, కళ్యాణ్ రామ్ బింబిసార2 కథ గురించి ఓ మీడియా వేదికగా హింట్ ఇచ్చారు. దాంతో అందరి ఫోకస్ బింబిసార పార్ట్2 పైన పడింది.

ఇక బింబిసారలో రాజు బింబిసార గురించి ఎక్కువగా సన్నివేశాలు లేవు కాబట్టి పార్ట్ 2లో రాజు కథ నిడివి ఎక్కువగా ఉంటుందని అంతా ఆశిస్తున్నారు. బింబిసార అనేక రాజ్యాలను ఆక్రమించుకున్నాడని వెల్లడించినా ఆ సన్నివేశాలను తెరపై చూపించలేదు. కాబట్టి బింబిసార2 సినిమాలో ఆ సన్నివేశాలను దర్శకుడు చూపించనున్నారని తెలుస్తోంది. మరోవైపు బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా బింబిసార2 తెరకెక్కిస్తామని కళ్యాణ్ రామ్ అనడం కొసమెరుపు. బింబిసార1 మూవీ తమకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిందని కళ్యాణ్ రామ్ చెబుతూ పార్ట్ 2 కోసం మరింత కష్టపడతామని అన్నారు.

ఓ వైపు నందమూరి అభిమానులు ఈ సినిమా చూసి కేరింతలు కొడుతున్నారు. బాహుబలి సినిమా వందల కోట్లతో రూపొందిందని, కేవలం 40 కోట్లతోనే కళ్యాణ్ రామ్ ఈ సినిమా తీసి హిట్ కొట్టాడని మురిసిపోతున్నారు అభిమానులు. బింబిసార 2 సినిమా బాహుబలి సినిమాని తలదన్నేలా రూపొందిస్తారని ఊహాగానాలు చేస్తున్నారు. బింబిసార2 సినిమాలోనే దర్శకుడు అసలు కథను చూపించనున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. కాగా బింబిసార2 సినిమాతో కళ్యాణ్ రామ్ ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందేమో చూడాల్సి ఉంది. ఇక కళ్యాణ్ రామ్ సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయనే సంగతి తెలిసిందే!

Share post:

Latest