కొరటాల శివ, ఎన్టీఆర్ సినిమా ఇప్పట్లో స్టార్ట్ కాదా.. ఫ్యాన్స్‌కి షాకిస్తున్న నిజాలు!

ఎన్టీఆర్‌తో కొరటాల సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై చాలా కాలం అవుతోంది. అయినా కూడా ఎన్టీఆర్ కొరటాల శివతో ఇప్పటివరకు సినిమా స్టార్ట్ చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఇన్ని రోజులు ఆషాడమాసం పేరుతో సినిమాని వాయిదా వేస్తూ వచ్చారు. స్క్రిప్ట్ సెకండాఫ్‌లో మార్చాల్సిన అంశాలున్నాయని… కొంత కాలంగా సరైన హీరోయిన్ దొరకడం లేదని కూడా సాకులు చూపెట్టారు.


ఈ నేపథ్యంలోనే ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైన కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుందని ఇటీవలే వెల్లడించారు. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి చూస్తుంటే మరో ఆరు నెలల్లో షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశమే లేదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే కొరటాల శివ ఇంకా స్క్రిప్ట్ సిద్ధం చేయలేదట. అతనికి సరైన కథానాయిక కూడా దొరకలేదట. మరోవైపు ఎన్టీఆర్ లుక్‌ను పూర్తిగా మేకోవర్ చేయాల్సి ఉంది. బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ ఎలా కనిపించాడు మీరు చూసే ఉంటారు. ఈ తారక్ లుక్‌ చాలా అంటే చాలా బ్యాడ్‌గా ఉందని అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు.

బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ పాల్గొన్నప్పుడు చాలా లావుగా కనిపించాడు. అతని ముఖం చాలా ఉబ్బిపోయి అందం మొత్తం పోయింది. చూస్తుంటే రాఖీ సినిమాలో కనిపించినట్లు ఉన్నాడు. అయితే ఈ బరువు అంతా పోగొట్టడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. స్క్రీన్‌పై డ్యాన్స్‌లు వేయడంతోపాటు అందంగా కనిపించడానికి అతడు స్లిమ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అలా అవ్వాలంటే అతనికి కనీసం మూడు నెలల సమయం పడుతుందని అంటున్నారు. కాబట్టి ఈ సినిమా ప్రారంభం కావడానికి కొన్ని నెలలు సమయం పట్టవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ కొరటాల సినిమాను మొదటిగా చేయాలని అనుకుంటున్నాడా లేక పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌ను ప్రశాంత్ నీల్ తో కలిసి తెరకెక్కించనున్నాడా అనేది తెలియాల్సి ఉంది.

Share post:

Latest