కోమటిరెడ్డి..బలాలు…బలహీనతలు?

చాలాకాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ బీజేపీకి మద్ధతుగా మాట్లాడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అలాగే స్పీకర్ కు రాజీనామా లేఖని అందించడం…వెంటనే స్పీకర్ రాజీనామాని ఆమోదించడం జరిగిపోయాయి.  దీంతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది.

ఈ ఉపఎన్నికలో గెలవడానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమకంటూ సెపరేట్ వ్యూహాలతో ముందుకొస్తున్నాయి. కాసేపు ఆ రెండు పార్టీల గురించి పక్కన పెడితే…అసలు బీజేపీ నుంచి బరిలో దిగబోతున్న కోమటిరెడ్డి బలాలు ఏంటి…బలహీనతలు ఏంటి అనేది ముందు తెలుసుకుందాం. వీటి కంటే ముందు మునుగోడు కాంగ్రెస్, కమ్యూనిస్టుల అడ్డా అనే సంగతి చెప్పుకోవాలి. ఇక్కడ మెజారిటీ సార్లు కాంగ్రెస్, కమ్యూనిస్టులు గెలిచారు.

అయితే బీజేపీ ఇంతవరకు ఇక్కడ సత్తా చాటలేదు. అసలు సెకండ్ పొజిషన్ లో కూడా నిలబడలేదు. అంటే ఇక్కడ బీజేపీకి బలం లేదు…ఇది కోమటిరెడ్డికి మైనస్సే. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి వస్తున్న కోమటిరెడ్డికి పూర్తి స్థాయిలో కార్యకర్తల మద్దతు దక్కకపోవడం మైనస్. ఎందుకంటే కోమటిరెడ్డితో పాటు కొందరు మాత్రమే బీజేపీలోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారు గాని…మిగతా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీలోకి వెళ్లడానికి ఇష్టపడటం లేదు.

ఇక సంస్థాగతంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బలం ఉండటం కూడా రాజగోపాల్ కి మైనస్సే. అలాగే ఇక్కడ కమ్యూనిస్టులకు కాస్త పట్టు ఉంది…వారు బీజేపీ వైపు మాత్రం రారు…వారు టీఆర్ఎస్ కు గాని, కాంగ్రెస్ కు గాని మద్ధతు ఇస్తే కోమటిరెడ్డికి అది కూడా మైనస్ అవుతుంది. అదే సమయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీ అభ్యర్ధులని నిలబెడితే కోమటిరెడ్డికి ఇబ్బందే.

బలాలు విషయానికొస్తే…కోమటిరెడ్డికి ఉన్న అతి పెద్ద ప్లస్…ఆయన సొంత ఇమేజ్..ఆర్ధికంగా బలంగా ఉండటం…అలాగే కేంద్రం పెద్దలు సపోర్ట్…రాష్ట్రంలో బీజేపీ బలం పెరుగుతూ ఉండటం…టీఆర్ఎస్ పై వ్యతిరేకత…కాంగ్రెస్ బలహీనపడటం లాంటి అంశాలు కోమటిరెడ్డికి కలిసిరావచ్చు. అలాగే తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్ధతు ఉండటం కూడా ప్లస్ కానుంది. ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, పార్టీ మారడం అనే అంశం కూడా కలిసిరావచ్చు. మొత్తానికైతే కోమటిరెడ్డికి ప్లస్సులు ఎన్ని ఉన్నాయో…మైనస్సులు అన్ని ఉన్నాయి. మరి చూడాలి మునుగోడులో కోమటిరెడ్డి మళ్ళీ సత్తా చాటగలరో లేదో.

Share post:

Latest