ఒక్క మాటతో వాళ్ల నోర్లు మూయించిన నిఖిల్..”నువ్వు సూపర్ బ్రదర్..”..!

ఇటీవల రిలీజైన సినిమా ‘కార్తికేయ 2’ మంచి టాక్ తో దూసుకుపోతోంది. వాయిదాల మీద వాయిదాలు పడిన సినిమా ఎట్టకేలకు రిలీజై బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అగ్ర నిర్మాతలు ఒత్తిడితో ఈ సినిమాని పదే పదే బలమైన కారణాలు లేకుండానే వాయిదా వేయాల్సి రావటంతో సినిమా యూనిట్ తో పాటు, హీరో నిఖిల్ చాలా అసహనానికి గురైన విషయం మనకు తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో రాజకీయం బాగా పెరిగిపోయిందని.. చిన్న సినిమాలను విడుదల చేయడానికి కొంతమంది అడ్డుపడుతున్నారని ఇందులో భాగంగానే కార్తికేయ 2 సినిమాని వెనుక నట్టేసారు అన్నది ఓవర్గం ఆరోపణ.

Karthikeya 2 Movie Review

ఈ సినిమా ప్రమోషన్ లో “నా సినిమాకి ఎందుకు ఇలా అవుతుందని”… అంటూ నిఖిల్ బాధపడటంతో .. దీనికి ఇంకా బలం చేకూరింది. సినిమా అంటేనే ఒక మహా యజ్ఞం. అనేక వ్యవప్రయాసల కోర్చి నిర్మాత, దర్శకుడు, ఆర్టిస్టులు, మిగతా టెక్నీకల్ టీమ్ ఓ తపస్సులా కష్టపడతారు. వారి శ్రమకు బదులుగా రిలీజ్ కాబోతుందన్న చివరి నిమిషంలో సినిమా వాయిదా పడితే మాత్రం వారి బాధ వర్ణనాతీతం.

అయితే అదే సినిమా చివరకు విడుదలై సూపర్ హిట్టై.. మంచి వసూళ్లు సాధిస్తే మాత్రం వారి బాధ పూర్తిగా తొలగిపోతుంది. ప్రస్తుతం ఆ ఆనందంతోనే కార్తికేయ టీమ్ పండగ చేసుకుంటోంది. ఈ సినిమాని వెనక్కి నెట్టేసిన ఆ నిర్మాతల గురించి ఇప్పుడు కథలుగా మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాకి వెనక్కి తోసిన మాచర్ల నియోజకవర్గం సినిమా ఫలితం అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమాని వెనక్కి నెట్టిన థాంక్యూ సినిమా పరిస్థితి కూడా మనం చూశాం.

Karthikeya 2 Movie OTT Release Date, OTT Platform, Time and More

 

దాంతో ‘కార్తికేయ’ శాపం వాటికి తగిలిందని అంతా అనుకుంటున్నారు. నిఖిల్ అభిమానులు ‘నిన్ను తొక్కేయాలనుకున్నారు.. వాళ్ళే దెబ్బ తిన్నారు..నువ్వు సూపర్ బ్రదర్” అంటూ నిఖిల్‌ని ట్యాగ్ చేస్తూ ట్వీట్లతో హోరెత్తించేస్తున్నారు. ఈ రాజకీయం వెనుక ఓ ప్రముఖ నిర్మాత పేరు లేవనెత్తుతున్నారు.

Share post:

Latest