అమీర్‌, అక్ష‌య్‌కే చెమ‌ట‌లు ప‌ట్టించిన కార్తీకేయ 2.. నిఖిల్ దెబ్బ మామూలుగా లేదే..!

నిఖిల్ న‌టించిన కార్తీకేయ 2 ఈనెల 13న నా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తో అన్ని భాషల్లో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ సినిమా మైథలాజికల్ అడ్వెంచరస్ సస్పెన్స్ థ్రిల్లర్గా తెర‌కెక్కింది. బాలీవుడ్‌లో కార్తీకేయ 2 త‌క్కువ స్క్రీన్స్‌లో రీలిజ్ చేయ్య‌గా అక్క‌డ కూడా భారి క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ,అక్షయ్ కుమార్ సినిమాల క‌లెక్ష‌న్లు సైతం కార్తికేయ2 సినిమా కలెక్షన్లను అందుకోలేకపోతున్నాయి.

శనివారం ఈ సినిమాకి 7 లక్షల రూపాయల క‌లెక్ష‌న్లు రాగా… ఆదివారం 28 ల‌క్ష‌లు వసూల‌య్యాయి. బాలీవుడ్ లో రిలీజ్ అయిన లాల్ సింగ్ చ‌ద్దా, రక్షాబంధన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయాయి. ఇదే సమయంలో ఎవరు ఊహించినట్టు కార్తికేయ 2 బాలీవుడ్‌లో తన సత్తా చూపించింది. అటు ఓవర్సీస్ లోను ఈ సినిమాకి భారీ వసూలు వస్తున్నాయి. మొదటి రోజే ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

చందు మొండేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఒక ముఖ్య పాత్రలో నటించాడు. ఈ సినిమా 2013లో వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వల్ గా వచ్చింది. ఈ రెండు సినిమాలు నిఖిల్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి. కార్తికేయ 2 ఏకంగా నిఖిల్ కు పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్‌ తీసుకొచ్చింది.

Share post:

Latest