పాల్-పవన్ ఒకటే…జోగి బ్యాడ్ టైమ్?

ఏపీలో పవన్‌కు ఎంత బలం ఉందో అందరికీ తెలిసిందే..జనసేన పార్టీకి 7 నుంచి 8 శాతం ఓటు బ్యాంక్ ఉంది…ఈ ఓటు బ్యాంక్‌తో జనసేన సక్సెస్ అవ్వడం చాలా కష్టం. కానీ అదే సమయంలో పవన్ గాని టీడీపీతో కలిస్తే గెలుపోటములని తారుమారు చేసేయొచ్చు. ఆ బలం పవన్‌కు ఉంది. అందుకే అనుకుంటా టీడీపీ-జనసేన కలవకుండా ఉండటానికి వైసీపీ నేతలు గట్టిగానే ట్రై చేస్తున్నారు. దమ్ముంటే ఆయన 175 స్థానాల్లో పోటీ చేయాలని వైసీపీ మంత్రులు రెచ్చగొడుతున్నారు.

అలాగే ఆయనకు ఒక ఎమ్మెల్యే గెలిచి బలం కూడా లేదని ఎగతాళి చేస్తున్నారు. అసలు ఆయన పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారని, నెక్స్ట్ 20 చోటల్ పోటీ చేసిన గెలవరని కామెంట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ పవన్ బలం ఏమి లేదని వైసీపీ నేతలు మైండ్ గేమ్ ప్లే చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. అందుకే ఆయన్ని ఎక్కువగా ఎగతాళి చేస్తున్నట్లు అర్ధమవుతుంది. ఇక తాజాగా మంత్రి జోగి రమేశ్…పవన్‌పై సెటైర్లు వేశారు.

కే‌ఏ పాల్‌కు…పవన్ కల్యాణ్‌కు పెద్ద తేడా లేదని, ఇద్దరికీ ఏపీలో సీట్లు లేవని ఎద్దేవా చేశారు. జోగి చెప్పింది వాస్తవమే…ఏపీలో పాల్‌ పార్టీకి సీట్లు లేవు..పవన్ జనసేన పార్టీకి సీట్లు లేవు. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా వెన్నుపోటు పొడిచి వైసీపీ వైపుకు వెళ్లారు. అంతమాత్రాన పవన్ బలాన్ని తక్కువ అంచనా వేస్తే రిస్క్‌లో పడేది వైసీపీనే. ఆయన సింగిల్ గా వైసీపీకి చెక్ పెట్టకపోవచ్చు. కానీ టీడీపీతో కలిస్తే చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఓటమి తప్పదు.

అందులో మొదట నష్టపోయేది జోగి రమేశ్ అని కొందరు పవన్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓట్లు చీలడం వల్లే జోగి పెడనలో గెలవగలిగారు అని, మంత్రి అయ్యారని, ఈ సారి జోగి గెలుస్తారో? లేదో చూద్దామని అంటున్నారు. గత ఎన్నికల్లో పెడనలో జోగి…టీడీపీపై 7 వేల ఓట్ల మెజారిటీతో గెలిస్తే…అక్కడ జనసేనకు 18 వేల ఓట్లు పడ్డాయి. అంటే టీడీపీ-జనసేన కలిస్తే ఏం అయ్యేదో ఊహించుకోవచ్చు. మొత్తానికి పవన్‌తో జోగికే రిస్క్ ఎక్కువ.