వైసీపీ వైపే అరకు…సైకిల్ అస్సామే!

రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు వైసీపీకి కంచుకోటలుగా ఉన్నాయని చెప్పొచ్చు…ఆ జిల్లాల్లో వైసీపీ అదిరిపోయే విజయాలు సొంతం చేసుకుంటూ ఉంటుంది…అయితే సీమ మాదిరిగా కోస్తాలో, ఉత్తరాంధ్రలో వైసీపీ విజయం అంత సులువు కాదని చెప్పొచ్చు. ఈ జిల్లాల్లో టీడీపీ బలంగానే ఉంది. కానీ ఈ జిల్లాల్లో కూడా వైసీపీకి కంచుకోట ల్లాంటి స్థానాలు కొన్ని ఉన్నాయి..ఆ స్థానాల్లో వైసీపీని ఓడించడం చాలా కష్టం.

రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నా సరే..ఆ స్థానాల్లో వైసీపీ గెలుపుని ఆపడం చాలా కష్టమైన పని.  అలా వైసీపీ గెలుపుని ఆపడం కష్టమైన స్థానాల్లో అరకు ముందు వరుసలో ఉంటుంది..అరకు పార్లమెంట్ కావొచ్చు…అరకు అసెంబ్లీ కావొచ్చు. ఈ రెండు చోట్ల వైసీపీకి బలం ఎక్కువ. గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ స్థానాలు మొదట నుంచి కాంగ్రెస్ తర్వాత, వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి.

ఇక్కడ జనం ఎక్కువ వైఎస్సార్ ఫ్యామిలీ అంటే అభిమానంతో ఉంటాయి…అందుకే అరకు పార్లమెంట్, అరకు అసెంబ్లీలో టీడీపీ గెలుపు చాలా కష్టమైన పని. 2009, 2014, 2019 ఎన్నికల్లో అరకు పార్లమెంట్ లో టీడీపీ గెలవలేదు. 2009లో కాంగ్రెస్, 2014, 19 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది…నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ టీడీపీకి ఏ మాత్రం గెలుపు అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ రాష్ట్రలో టీడీపీకి అనుకూల వాతావరణం ఉన్నా సరే…అరకులో మాత్రమే ఉండేలా లేదు. ఇక్కడ ప్రజలు మరొకసారి వైసీపీకి పట్టం కట్టడం గ్యారెంటీ అని తెలుస్తోంది.

అటు అరకు అసెంబ్లీ స్థానంలో కూడా వైసీపీ గెలుపుని ఆపడం కష్టమని చెప్పొచ్చు. 2009లో ఇక్కడ టీడీపీ గెలిచింది…2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ గెలిచింది.విచిత్రం ఏంటంటే…2019లో టీడీపీ డిపాజిట్ కోల్పోయిన స్థానం ఇదే. ఇప్పటికీ అక్కడ టీడీపీ పుంజుకోలేదు. కాబట్టి ఈ సారి కూడా అరకులో సైకిల్ పని అస్సామే.

Share post:

Latest