ఆనంకు నేదురుమల్లి చెక్?

ఏపీ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నాయకుడుగా ఉన్న ఆనం రామ్ నారాయణరెడ్డి రాజకీయ భవిష్యత్ పై క్లారిటీ మిస్ అవుతుంది…ఆయనకు నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ నుంచి సీటు వస్తుందా? లేక ఆయన వైసీపీ వదిలి వెళ్లిపోతారా? అనే ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. అసలు సీనియర్ నాయకుడు..ఆయనకు సీటు గురించి డౌట్ ఏంటి అని అంతా అనుకోవచ్చు. అలా డౌట్లు పెరగడానికి కారణం కూడా ఆయనే అని చెప్పొచ్చు.

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. ఆనం రామ్ నారాయణరెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి…ఈ బ్రదర్స్ కు ఎదురులేని పరిస్తితి. ఇక ఆనం ఫ్యామిలీ…మొదట టీడీపీలో ఆ తర్వాత కాంగ్రెస్ లో అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. ఆనం రామ్ నారాయణరెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు. ఇక రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ నష్టపోవడంతో…ఆనం బ్రదర్స్ టీడీపీలోకి వచ్చారు. ఆనం  వివేకా చనిపోవడం…ఆ తర్వాత రామ్ నారాయణరెడ్డి వైసీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికల్లో వెంకటగిరి నుంచి పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు.

సీనియర్ కావడంతో మంత్రి పదవి ఆశించారు…కానీ దక్కలేదు..అలాగే పార్టీలో పెద్దగా ప్రాధాన్యత కూడా దక్కలేదని చెప్పొచ్ఛు..ఇదే క్రమంలో అప్పుడప్పుడు ఆనం…సొంత ప్రభుత్వంపై విమర్శలు చేశారు…తన నియోజకవర్గాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు…అలాగే సొంత మంత్రులపై కూడా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఆనం సొంత పార్టీపైనే రివర్స్ అవ్వడంతో..పార్టీలో ఆనంకు ప్రాధాన్యత తగ్గింది.

అలాగే నెక్స్ట్ ఎన్నికల్లో ఆయనకు సీటు కూడా డౌటే అని ప్రచారం మొదలైంది. ఇప్పటికే వెంకటగిరిలో వైసీపీ తరుపున మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు రామ్ కుమార్ రెడ్డి…దూకుడుగా పనిచేస్తున్నారు. 2018లోనే వైసీపీలో చేరిన ఈయనకు అప్పుడు సీటు దక్కలేదు. ఈ సారి ఎలాగైనా సీటు దక్కించుకోవాలని రామ్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. ఇక ఆనం వైఖరిలో మార్పు రావడంతో…ఇప్పుడు వెంకటగిరి సీటు నేదురుమల్లిదే అని ప్రచారం జరుగుతుంది. మరి ఆనంకు చెక్ పెట్టి వెంకటగిరి సీటు నేదురుమల్లికి ఇస్తారేమో చూడాలి.