గోరంట్ల మ్యాటర్ డైవర్ట్?

ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతుంది…ఆ వీడియో వ్యవహారం కాస్త ఇప్పుడు రెండు కులాల మధ్య చిచ్చు రాజేసే పరిస్తితికి వచ్చింది. అదే సమయంలో 2015లో తెలంగాణలో జరిగిన ఓటుకు నోటు కేసు తెరపైకి తీసుకొస్తున్నారు. అసలు వీడియో నిజమో కాదో తెలిస్తే సరిపోతుంది…అప్పుడు దాని బట్టి చర్యలు తీసుకోవచ్చు..అలా కాకుండా రెండు కులాల మధ్య రచ్చ ఎందుకు జరుగుతుంది..అసలు సంబంధం లేకుండా ఓటుకు నోటు కేసు ఎందుకు తెరపైకి వచ్చింది…వీటి అన్నిటికి విశ్లేషకులు ఒకటే సమాధానం చెబుతున్నారు..ఇదంతా పోలిటికల్ డైవర్షన్ అని అంటున్నారు.

మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది..దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి..ఎంపీని సస్పెండ్ చేయాలనే డిమాండ్ వచ్చింది. అటు మాధవ్ ఏమో…ఆ వీడియో మార్ఫింగ్ చేశారని, ఇదంతా టీడీపీ వాళ్ళ పని అని, అలాగే కమ్మ వర్గం పని అంటూ బూతులు తిట్టారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానని చెప్పారు. ఇక  వైసీపీ అధిష్టానం దీనిపై సీరియస్ గా ఉందని, ఎంపీని సస్పెండ్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అదేం జరగలేదు. పైగా ఈ విషయం కాస్త కమ్మ వర్సెస్ కురుబ కులాల మధ్య చిచ్చు పెట్టేలా మారింది.

మాధవ్ కమ్మ వర్గాన్ని తిట్టడంతో..ఆ వర్గం వారు ఫైర్ అవుతున్నారు. ఇటు మాధవ్ కు సపోర్ట్ గా కురుబ వర్గం నడుస్తోంది. అయితే తాజాగా కురుబ సంఘం..తమ వర్గం వారిని సమన్వయం పాటించాలని లేఖ విడుదల చేసింది. అటు కమ్మ వర్గం కూడా నిదానించింది. దీంతో కులాల మధ్య కుంపటి కాస్త ఆగింది.

ఇది ఆగిందనుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి…ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడారు…ఎప్పుడో జరిగిన దాన్ని…మాధవ్ వ్యవహారంతో లింక్ పెట్టారు. ఓటుకు నోటు కేసులో లీకైనా బాబు ఆడియో గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు ఓటుకు నోటు కేసుకు, మాధవ్ న్యూడ్ వీడియోకు ఎలాంటి సంబంధం లేదు…కాకపోతే ఈ వ్యవహారం డైవర్ట్ చేయడానికే ఓటుకు నోటు కేసు తీసుకొచ్చారని అర్ధమవుతుంది. కానీ ఏదేమైనా ప్రజలు మాధవ్ వ్యవహారంపై సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. అందులో నిజనిజాలు తెలిసి…ఆయనపై చర్యలు తీసుకునేవరకు వదిలేలా లేరు. మరి చూడాలి రానున్న రోజుల్లో మాధవ్ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో.

Share post:

Latest