బాబు… చిన్నికే ఫిక్స్ చేస్తారా?

ఈ మధ్యకాలంలో టీడీపీలో కేశినేని నాని ఫ్యామిలీకి సంబంధించి పెద్ద రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంపీ కేశినేని నాని…సొంత పార్టీలోని తప్పులని ఎత్తిచూపుతూ టీడీపీ అధినాయకత్వంపై విమర్శలు చేస్తున్న సంగతి కూడా తెలిసిందే..అలాగే తనకు వ్యతిరేకంగా తన తమ్ముడు కేశినేని శివనాథ్ ని ప్రోత్సహిస్తున్నారని కేశినేని నాని విమర్శలు చేశారు. అయితే నెక్స్ట్ విజయవాడ ఎంపీ సీటు శివనాథ్ కు ఇస్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే…ఇప్పటికే శివనాథ్ అలియాస్ చిన్ని..విజయవాడ పార్లమెంట్ పరిధిలో పార్టీ తరుపున పనిచేస్తున్నారు.

దీంతో నెక్స్ట్ నానిని పక్కన పెట్టి చిన్నికి సీటు ఇస్తారని ప్రచారం వచ్చింది. కానీ ఈ ప్రచారంలో పెద్దగా వాస్తవం లేదని టీడీపీ శ్రేణులు భావించాయి..అలాగే కేశినేని నాని పార్టీ మారడం జరిగే పని కాదని అనుకున్నారు. ఇందులో కేశినేని నాని పార్టీ మారడం అనేది జరగని పని చెప్పుకోవచ్చు..ఆయన టీడీపీలో ఉన్న తప్పులని ఎత్తిచూపుతున్నారు తప్ప…పార్టీ మారుతానని చెప్పడం లేదు..పైగా టీడీపీలో ఇంకా యాక్టివ్ గా పనిచేస్తున్నారు.

తాజాగా కూడా తన కుమార్తె శ్వేత నిశ్చితార్థ వేడుకలకు చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కుటుంబ సభ్యులు మొత్తం హాజరయ్యారు. ఆ వేడుకలో బాబు, కేశినేనితో చాలా సన్నిహితంగా మెలిగారు. ఇలాంటి పరిస్తితుల్లో కేశినేని పార్టీ మారడం అనేది కష్టమే. కాకపోతే ఆయనకు సీటు విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. నెక్స్ట్ ఎన్నికల్లో తన కుమార్తె శ్వేతని అసెంబ్లీ బరిలో ఉంచాలని చూస్తున్నట్లు తెలుస్తోంది..ఇదే క్రమంలో కేశినేని ఎన్నికల బరి నుంచి తప్పుకునే ఛాన్స్ కూడా ఉంది.

ఈ క్రమంలోనే చిన్నిని విజయవాడ పార్లమెంట్ బరిలో దించుతారని తెలుస్తోంది…ఇప్పటికే తన అన్నతో విభేదాలు ఉన్న మాట వాస్తవమే అని, అలాగే నెక్స్ట్ పోటీ చేయమంటే ఎక్కడైనా పోటీ చేస్తానని చిన్ని చెబుతున్నారు. అంటే పోటీ చేయాలని చిన్నికి కూడా ఉంది. మరి చంద్రబాబు…కేశినేని శ్వేతకు అసెంబ్లీ సీటు, చిన్నికి పార్లమెంట్ సీటు ఇస్తారా? లేక నానినే మళ్ళీ ఎంపీ సీటులో నిలబెడతారేమో చూడాలి.

Share post:

Latest