అంబటికి పవన్‌తో రిస్క్ ఉందా?

1989 తర్వాత అంబటి రాంబాబుకు 2019 ఎన్నికలు కలిసొచ్చాయనే చెప్పాలి. అప్పుడు ఎప్పుడో 1989లో అంబటి కాంగ్రెస్ తరుపున రేపల్లెలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు…అంతే ఇంకా మళ్ళీ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలవలేదు…ఒకోసారి సీటు కూడా దొరకలేదు. అయితే 2014లో అంబటి వైసీపీ నుంచి పోటీ చేసి కేవలం వెయ్యి ఓట్ల మెజారిటీతో సత్తెనపల్లిలో కోడెల శివప్రసాద్ చేతిలో ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి జగన్ గాలి…ఓడిపోయిన సానుభూతి అంబటికి కలిసొచ్చింది.

కోడెలపై 21 వేల ఓట్ల మెజారిటీతో అంబటి మళ్ళీ 1989 తర్వాత ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఎంతో సీనియర్ అయిన అంబటికి మొదట విడతలో మంత్రి పదవి దక్కలేదు…కానీ రెండో విడతలో మంత్రి కల నెరవేరింది. ఇలా అంబటికి అన్నిరకాలుగా అదృష్టం కలిసొచ్చింది…మరి ఈ అదృష్టం ఇలాగే కంటిన్యూ అవుతుందా? వచ్చే ఎన్నికల్లో కూడా అంబటికి గెలుపు అవకాశాలు ఉన్నాయా? అంటే ప్రస్తుతానికైతే సత్తెనపల్లెలో అంబటికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు.

గత ఎన్నికలతో పోలిస్తే కాస్త బలం తగ్గింది గాని..పూర్తి స్థాయిలో బలం తగ్గలేదు…పైగా టీడీపీ అభ్యర్ధి ఎవరో క్లారిటీ రావడం లేదు. కోడెల తనయుడు శివరాం సీటు కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. కాకపోతే నెక్స్ట్ టీడీపీ అభ్యర్ధి బట్టి అంబటి గెలుపోటములు ఉండొచ్చు. అదే సమయంలో పవన్ కల్యాణ్ గాని..టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకుంటే అంబటికి కాస్త రిస్క్ ఉంటుంది.

ఎందుకంటే గత ఎన్నికల్లో ఇక్కడ జనసేనకు 9 వేల ఓట్లు వరకు పడ్డాయి. అయితే సత్తెనపల్లెలో కాపు ఓట్లు ఎక్కువే…కానీ గత ఎన్నికల్లో జనసేనకు ఓటు వేయడం వల్ల ఉపయోగం ఉండదని, ఈ సరికి పవన్ అభిమానులు తనకు మద్ధతుగా నిలవాలని అంబటి ప్రచారం చేశారు. దీంతో అక్కడ కాపులు అంబటి వైపు నిలబడ్డారు. కానీ అధికారంలోకి వచ్చాక…అంబటి…పవన్ పై ఎలాంటి విమర్శలు చేస్తున్నారో తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో నెక్స్ట్ గాని పవన్, టీడీపీతో కలిస్తే సత్తెనపల్లెలో అంబటికి గెలుపు అవకాశాలు తగ్గుతాయి.

 

Share post:

Latest