అషు రెడ్డి సమంతను ఫాలో అయిపోతుందా? టైట్ ఫిట్ అందాలతో రెచ్చగొడుతోంది!

అషు రెడ్డి గురించి కుర్రకారుకి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. మొదటగా బిగ్ బాస్ షో ద్వారా అందరికీ సుపరిచితం అయిన అషు అచ్చం సమంతని పోలి ఉండటం ఆమె కెరీర్ కి ప్లస్ అయింది. ఆ తరువాత ఓ సందర్భంలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఓ హాట్ ఇంటర్వ్యూలో పాల్గొని కాకరేపింది. మొత్తంగా అప్పటినుండి ఈమెకు కుర్రకారులో మంచి ఆదరణ లభించింది. సినిమాల సంగతి దేవుడెరుగు కానీ, ప్రస్తుతం అమ్మడు దాన్ని క్యాష్ చేసుకొనే పనిలో పడింది. తాజాగా అమ్మడు వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తూ దేశాలు చుట్టి వస్తోంది అషు రెడ్డి.

ఈ క్రమంలో తన ప్రేక్షకులకు అందాల విందు ఇస్తోంది. అదేనండి కాస్త రొమాంటిక్ ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు వాటికి నీరాజనాలు పలుకుతున్నారు. అదే కోణంలో ఈ సారి కాసింత డిఫరెంట్ గా రొమాంటిక్ ఫోటో షూట్ ట్రై చేసింది. బ్లాక్ డ్రెస్ వేసి తన టైట్ ఫిట్ అందాలను చూపిస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది. తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ఫొటోస్ షేర్ చేసింది అషు రెడ్డి. దీంతో క్షణాల్లో ఈ పిక్స్ వైరల్ అయ్యాయి. సమంతను మించిపోయే అందం ఇది అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

ప్రస్తుతం లండన్ లో షికార్లు కొడుతున్న అషు రెడ్డి.. అక్కడి వీధుల్లో చక్కర్లు కొడుతూ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తోంది. అంతేకాకుండా ఆయా ఫోటోలను, వీడియోలను ఎప్పటిలాగే తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేస్తోంది. ఆమె రెండు సార్లు బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లి రావడం అందరికీ తెలిసినదే. ఇక అషు పవన్ కళ్యాణ్ వీరాభిమాని అన్న సంగతి విదితమే. అందువలనే ఆయనపై ఉన్న అభిమానంతో తన ఎద భాగంలో పవన్ కళ్యాణ్ అనే పేరును టాటూగా వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. డిఫరెంట్ టైపు ఫోటోలు దిగడం, వాటిని నెటిజన్లతో పంచుకుంటూ ఉండటం అషు రెడ్డి హ్యాబీ.

Share post:

Latest