ఇంట్రెస్టింగ్: ఒక్క నిర్ణయంతో రాశి జీవితానే మార్చేసిన స్టార్ హీరో భార్య ఎవరో తెలుసా..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ఓ పవర్ ఫుల్ హీరో. ప్రజెంట్ ఆయన సినిమాల రిజల్ట్ ఒక్కాలా ఉంది కానీ..ఆయన కెరియర్ స్టార్టింగ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కు న‌చ్చే సినిమాలు చాలా తీశారు. వాటిలో మెయిన్ చెప్పుకోవాల్సిన సినిమా గోకులంలో సీత. ఈ సినిమా ఆయన కెరియర్ లోనే సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా ఆ టైంలో కుర్రాళ్ళతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగా నచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశి నటించిన విషయం తెలిసిందే. తెర పై ఇద్దరి జంట బాగా అలరించింది.Gokulamlo Seetha - Album by Koti | Spotify

కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశిని సెలక్ట్ చేసింది మెగాస్టార్ భార్య పవన్ కళ్యాణ్ వదిన సురేఖనట.రాశికి చిరంజీవి ఫ్యామిలీతో ఉన్న మంచి రిలేషన్ కారణంగానే ఈ ఆఫర్ వచ్చిందట. చిరంజీవి హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాను హిందీలో రీమేక్ చేసే టైంలో రాశి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. అలా రాశికి చిరంజీవి కుటుంబంతో రిలేషన్ ఏర్పడింది. అదే సందర్భంలో ఒకసారి చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి చెన్నై వెళ్లారు ఆ టైంలో రాశి కుటుంబ సభ్యులకు కూడా చెన్నైలోనే ఉండేవారు. చెన్నై వెళ్లిన చిరంజీవి నుండి రాశి తండ్రికి ఫోన్ వచ్చిందంట. దీంతో రాశి తండ్రి ఆమె ఫోటోలను తీసుకుని చిరును కలిసేందుకు వెళ్లారట. అక్కడ చిరంజీవితో పాటు సురేఖ కూడా ఉన్నారట. రాశి తండ్రి తెచ్చిన ఫోటోలను చూసి రాశి హీరోయిన్ అయితే బాగుంటుందని అన్నారట. అప్పుడే పవన్ కళ్యాణ్ గోకులంలో సీత స్టోరీని చిరంజీవి సురేఖ విన్నారట రాశి ఫోటోలను చేసిన సురేఖ పవన్ కళ్యాణ్ పక్కన రాశి అయితే బాగుంటుంది అని చెప్పడంతో.. దీంతో చిరంజీవి కూడా ఓకే అనేసారు.

Watch Gokulamlo Seetha | Prime Video
ఆ తర్వాత దర్శికుడు మోడ్రన్ డ్రెస్సులో ఫోటోలు తీసి ప్రొడ్యూసర్ కి చూపించారు ప్రొడ్యూసర్‌లు కూడా ఒకే చెప్పటంతో రాశిని హీరోయిన్‌గా ఫైనల్ చేశారు. అలా చిరంజీవి భార్య రికమండేషన్ తో రాశి పవన్ కళ్యాణ్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. తద్వారా రాశి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన విషయం మనకు తెలిసిందే. రాశి ఎక్కువగా ఫ్యామిలీ టైప్ క్యారెక్టర్లే చేసింది ముద్దుగా అందాల రాశి అని పిలిచేవారు. రాశి ఇప్పటికి కూడా తన సినిమా జీవితాన్ని అపకుండా సీరియల్స్ లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.

Share post:

Latest