హీరో గోపీచంద్ భార్య ఎవ‌రు… ఆమెకు ఇంత బ్యాగ్‌గ్రౌండ్ ఉందా..!

విలక్షణ నటుడు హీరో గోపీచంద్ గురించి అందరికి తెలిసిందే. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన తన సొంత టాలెంట్ తో తనకంటు ఒక స్పెషల్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నాడు. గోపీచంద్ తండ్రి ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విలక్షణమైన సినిమాలు తీసి తనకంటూ ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. హీరో గోపీచంద్ తండ్రి వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన తను హీరోగా సెట్‌ల్ అవ్య‌డానికి చాలా కష్టాలు అనుభవించాడు.

Gopichand to play a negative role in 'Gautham Nanda' | Telugu Movie News -  Times of India

కెరియర్ మొదటిలో తను తీసిన తొలివలపు సినిమా అట్టర్ ప్లాఫ్ కావడంతో గోపిచంద్ నిరాశకు గురయ్యాడు. మళ్లీ తర్వాత ఎలాగో తనేంటో ప్రూవ్ చేసుకోవాలని విలన్ పాత్రలు వేయడానికి కూడా సిద్ధపడ్డాడు. అదే క్రమంలో తేజ డైరెక్షన్లో వచ్చిన జయం సినిమాలో విలన్ గా నటించాడు. అందులో గోపీచంద్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం సినిమాలోనూ, మహేష్ బాబు నిజం సినిమాలోని విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు.

Reshma (Gopichand Wife) Wiki, Biography, Age, Family, Images - wikimylinks

తర్వాత హీరోగా యజ్ఞం సినిమాలో హీరోగా చేసి సూపర్ హిట్ కొట్టాడు. అప్పటినుంచి గోపీచంద్ వెనుతిరిగి చూసుకోలేదు. రణం- లక్ష్యం- లౌక్యం అంటూ వరుస సినిమాలతో బాక్సాఫీస్ హిట్ కొట్టి స్టార్ హీరోగా తన కంటు ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. గోపీచంద్ ఫ్యామిలీ విషయానికొస్తే ఆయనకు 2013లో రేష్మితో వివాహం జరిగింది. రేష్మి సీనియ‌ర్‌ హీరో శ్రీకాంత్ కు స్వయాన మేనకోడలు. శ్రీకాంత్ అక్క కూతురు అయిన రేష్మితోనే గోపీచంద్ పెళ్లి జరిగింది.

Gopichand's Son Virat Birthday Party Photos - Filmibeat

రేష్మీ అమెరికాలో చదివింది. గోపీచంద్ ఆమె ఫోటోలు చూసి ప్రేమలో పడ్డాడు. సీనియర్ యాక్టర్స్ చలపతిరావుకు చెప్పి పెళ్లి సంబంధం మాట్లాడమని అడిగాడట. చలపతిరావు శ్రీకాంత్ దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని చెప్పి ఒప్పించారట. శ్రీకాంత్ స్వయానా తన అక్కతో మాట్లాడి గోపీచంద్ కు రేష్మికి వివాహం జరిపించాడు. వీరిద్దరికి ఇద్దరు కుమారులు కూడా పుట్టారు. వారికి విరాట్ కృష్ణ- వియాన్ అనే పేర్లు కూడా పెట్టామని ఓ ఇంటర్వ్యూలో గోపిచంద్‌ చెప్పాడు.

Share post:

Latest