చచ్చినా అలా చేయను..ఒక్క హిట్ తో అనుపమ క్రేజీ డెసీషన్..!?

జీవితంలో తప్పులు అందరూ చేస్తుంటారు .తప్పులు చేయడం మానవ గుణం. కానీ అది తప్పు అని తెలుసుకున్న తరువాత కూడా ఆ తప్పును మళ్ళీ చేయడం.. అంతకన్నా పెద్ద తప్పు మరొకటి ఉండదు .అలా చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేసిన వారిని క్షమించడం కూడా పెద్ద తప్పే. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్నట్లుంది పాపం అనుపమ పరమేశ్వరం . అందుకే లేటుగా రెస్పాండ్ అయింది . మనకు తెలిసిందే అనుపమ పరమేశ్వరన్ చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది. చూడచక్కగా ఉంటుంది. పేరుకు మలయాళ బ్యూటీ నే అయినా చీరకట్టి.. బొట్టు పెట్టి.. తల్లో పూలు పెడితే.. అచ్చం తెలుగమ్మాయిలాగే అనిపిస్తుంది.

 

చూడగానే ఆకట్టుకునే ఫేస్ ..చూపులతోనే పలకరించే ఆ పెద్ద కళ్ళు.. ఎటువంటి వారినైనా సరే ఇట్టే పడేసే ఆ నవ్వు.. అబ్బో ఒకటా రెండా అనుపమ గురించి ఎంత చెప్పినా తక్కువే. వినే కొద్ది వినాలి అనిపిస్తూ ఉంటుంది.. చెప్పే కొద్ది ఇంకా ఏదో చెప్పాలి అనిపిస్తుంది. అలాంటి క్యారెక్టర్ అనుపమ పరమేశ్వరణ్ ది. అయితే సినీ ఇండస్ట్రీ ఎవరినైనా మార్చేస్తుంది అంటుంటారు. బహుశా అనుపమ పరమేశ్వరణ్ విషయంలో అదే జరిగింది. చక్కగా బుట్ట బొమ్మ లాగా ఉండే ఈ పాప ఇప్పుడు మోడ్రెన్ బేబీ గా తయారైంది.

 

ఒకప్పుడు పద్ధతిగా.. ట్రెడిషనల్ బట్టలు వేసుకుని అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్యకాలంలో రెచ్చిపోయి మరి హాట్ ఫోటోషూట్ లు చేస్తూ కుర్రాళ్లకు మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చింది. అంతేనా ఆ మధ్య రౌడీ బాయ్స్ సినిమాలో కెరియర్ లో ఎప్పుడు చేయని విధంగా రొమాన్స్ చేయడమే కాకుండా.. కుర్ర హీరోతో లిప్ లాక్ చేసి టాలీవుడ్ ను షేక్ చేసింది. కాగా రీసెంట్ గా అనుపమ పరమేశ్వరన్ నటించిన కార్తికేయ 2 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది ఈ సినిమా. నిఖిల్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేనా అనుపమ పరమేశ్వరణ్ కు బాలీవుడ్ ఆఫర్లు కూడా తెచ్చిపెట్టింది .

ఆ సంతోషంలో అనుపమ పరమేశ్వరణ్ రీసెంట్ గా అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే ఓ అభిమాని..” మీరు ఇకపై లిప్ లాక్ చేయొద్దు మేడమ్. మిమ్మల్ని అలా చూడలేము మీరు ట్రెడిషనల్ గానే మాకు నచ్చుతారు” అంటూ చెప్పుకొచ్చాడట. దీంతో అనుపమ పరమేశ్వరణ్ ..”ఇకపై అలా చేయను.. మిమ్మల్ని బాధ పెట్టను.. ఇక నుండి నా నుండి వచ్చే సినిమాలన్నీ.. మిమ్మల్ని హ్యాపీగానే ఫీల్ అయ్యేలా చేస్తాయి “అంటూ అభిమానుల కోసం క్రేజీ డెసిషన్ తీసుకుందట అనుపమ పరమేశ్వరణ్.

Share post:

Latest