భర్త అతి గారాభం.. ఆసుపత్రి పాలైన నయనతార..!!

దక్షిణాది సిని పరిశ్రమలో గత కొన్ని సంవత్సరాలుగా అగ్ర హీరోయిన్గా కొనసాగుతున్న ఏకైక హీరోయిన్ నయనతారా అని చెప్పవచ్చు. తరం మారుతున్నా.. ఆమె క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గిపోదు అని చెప్పాలి అందుకే సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు నయనతార. అంతేకాదు సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారిపోషకం తీసుకుంటున్న హీరోయిన్గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ఒక్కొక్క సినిమాకు రూ.10 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటుంది. ముఖ్యంగా కొన్ని సర్వేల ప్రకారం సౌత్ సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ కూడా నయనతార కావడం గమనార్హం. ఇకపోతే నయనతార తను ప్రేమించిన ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు విగ్నేష్ శివన్ ను అంగరంగ వైభవంగా ఈ ఏడాది జూన్ 9వ తేదీన వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.Nayanthara and Vignesh Shivan engaged, confirms the lady superstar

ఇక వివాహం అనంతరం ఒకవైపు సినిమా షూటింగ్లలో పాల్గొంటూనే.. మరొకవైపు తన భర్తతో కలిసి గుడులు, గోపురాలను సందర్శిస్తూ భక్తి పారవశ్యంలో మునిగితేలుతోంది. ఇదిలా ఉండగా నయనతారపై విగ్నేష్ శివన్ కు ఎంత ప్రేమ ఉందో మనకు వీరి వివాహం కాకముందే తెలుసు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా రకరకాల వంటకాలను తయారు చేసి మరి నయనతారకు తినిపిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే నిన్న వీకెండ్ కావడంతో ఈయన చేసిన ఒక అతి గారాభం వల్ల నయనతార ఆసుపత్రి పాలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.Nayanthara,Vignesh celebrate 5 years long love story, see pics, Nayanthara  and Vignesh Shivanసినిమా షూటింగ్లలో బిజీగా ఉంటూ అలసిపోయిన నయనతారపై అత్యంత ప్రేమను చూపించిన విగ్నేష్ వీకెండ్ లో భాగంగానే ఈమె కోసం ఒక అద్భుతమైన రెసిపీని తయారు చేసి రుచి చూపించాడట. కానీ ఆ రెసిపీ తిన్న తర్వాత ఆమెకు విపరీతమైన వాంతులు అలాగే చర్మం పై దద్దుర్లు, స్కిన్ ఎలర్జీ వంటి సమస్యలు ఎదురయ్యాయట. దీంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లగా అక్కడ కొన్ని గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచి ఆ తర్వాత డిస్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈయన అతి ప్రేమ, అతి గారాబం వల్ల నయనతార పాపం ఇలా ఆసుపత్రిపాలైందంటూ అభిమానులు జాలి చూపిస్తున్నారు.

Share post:

Latest