ఇండస్ట్రీపై హీరోయిన్ తమన్నా షాకింగ్ కామెంట్స్.. పోస్ట్ వైరల్..!!

సినీ ఇండస్ట్రీలో గ్లామర్ డ్యూటీ గా, మిల్క్ బ్యూటీ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హ్యాపీ డేస్ సినిమాతో మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ.. మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించి మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న తమన్నా తాజాగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మహిళల పాత్రలు కేవలం గ్లామర్ కోసం మాత్రమే ఉన్నాయా? అనే ప్రశ్నపై తాజాగా స్పందించింది. ఇక ఈ విషయంపై స్పందించిన ఆమె మహిళ అందంగా కనిపించే పాత్రలను చూసేందుకే సిద్ధంగా ఉంటాయని ఆమె తెలిపింది.Tamannaah Look Most Beautiful in Green Saree

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె ఇండియన్ సినీ పరిశ్రమలో మహిళల పాత్రల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను.. మహిళ అందంగా కనిపించే చిత్రాలను చూసేందుకు సిద్ధంగా ఉంటానని తెలిపింది. ఇక 17 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నాను.. కానీ ప్రస్తుతం నా ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది.. నటిగా నా ప్రయాణంలో వైవిధ్యమైన పాత్రలను అన్వేషిస్తున్నాను. మంచి కంటెంట్ ఉండే పాత్రకు ప్రాధాన్యత ఉంది అన్న తెలిస్తే ఆ సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను.10 సంవత్సరాల క్రితం నేను చేయలేనిది.. ఇప్పుడు చేస్తాను ..అలాగే చాలా క్రితం ప్రేక్షకులు అంగీకరించని కంటెంట్ ఇప్పుడు అంగీకరిస్తున్నారు అనుకుంటున్నాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ఇకపోతే యాక్షన్ సినిమాలలో కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల వచ్చిన ఎఫ్ 3 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తమన్నా భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తోంది. ఇకపోతే కెరియర్ పరంగా బిజీగా మారే ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు.

Share post:

Latest