జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న రాంచరణ్ హీరోయిన్.. వైరల్ అవుతున్న వీడియోలు! 

మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటించిన తొలి సినిమా మీకు గుర్తుందా? అయితే అందులో పొగరుగా నటించిన హీరోయిన్ నేహాశర్మ కూడా గుర్తుండే ఉంటుంది. ఎందుకు గుర్తుండదు, ఆమె అందులో చేసిన పాత్రని ఈజీగా మర్చిపోవడం కష్టం మరి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ చెర్రీకి తొలి చిత్రం కాగా అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. టాలీవుడ్‌లో నేహాకు కూడా ఇదే తొలి విజయంగా చెప్పుకోవచ్చు. అయితే, నేహా శర్మ పర్సనాలిటీ అప్పట్లో ఇలియానాను పోలి ఉండేది అని అందరు అంటూవుండేవారు. తరువాత ఎందుకనో అమ్మడు ఇక్కడ సినిమాలకు దూరం అయ్యింది.

చిరుత సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నేహాకు వరుసగా ఆఫర్లు వస్తాయని భావించారు. కానీ ఎందుకనో ఆ రేంజ్‌లో అవకాశాలు ఆమెకి ఇక్కడ రాలేదు. అవకాశాల కోసం నేహా చాలా రోజులు వేచిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత వరుణ్ సందేశ్ హీరోగా ‘కుర్రాడు’ సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అయినప్పటికీ నేహాశర్మ ఫేట్ మాత్రం మారలేదు. ఇక్కడే ఉంటే తన కెరీర్ ముగిసిపోతుందని భావించిన ముంబైకు మకాం మార్చేసింది. అక్కడ కొన్ని సినిమాల్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ పెద్ద సినిమా అవకాశాలు మాత్రం రాలేదు.

ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియాలో ఓసారి పెనుదుమారాన్నే రేపింది. “యాక్టింగ్ రాకపోయినా కొందరికీ అవకాశాలు వస్తాయి!” అని పరోక్షంగా సోనమ్ కపూర్‌, కరీనా కపూర్ లాంటివాళ్ళని ఉద్దేశించి విమర్శించి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఇకపోతే నేహాశర్మ చిరుత సినిమాకు ఇప్పటికీ గుర్తు పట్టలేనంతగా చాలా మారిపోయింది. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్‌ను సోషల్ మీడియాలో పంచుకునే ఈ భామ. తాజాగా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోను పోస్టు చేసింది. పింక్ కలర్ బ్రా ధరించి తన ఎద అందాలనే ఆవీడియోలో హైలెట్ చేయడంతో కుర్రకారు ఆ వీడియోని ఎగబడి మరీ చూస్తున్నారు.

Share post:

Latest