ఆ సింగర్‌ని పచ్చి బూతులు తిట్టిన హీరోయిన్.. ఎందుకో తెలిస్తే..!

ప్రముఖ తెలుగు ఛానల్ జీ తెలుగులో ప్రస్తుతం ‘జీ సరిగమప సింగింగ్ సూపర్ స్టార్’ షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ షో అదిరిపోయే సింగింగ్ పర్ఫార్మెన్స్‌లతో ఒక రేంజ్‌లో దూసుకుపోతోంది. ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా యాంకర్ శ్రీముఖి నిలుస్తోందని చెప్పొచ్చు. ఈ ముద్దుగుమ్మ తన చలాకి మాటలతో అద్భుతంగా యాంకరింగ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ పంచుతోంది. ఈ వారం ఎపిసోడ్‌లో శ్రీముఖి చేసిన ఒక పనికి ఓ హీరోయిన్ ఒక సింగర్‌ని దారుణంగా తిట్టేసింది. ఇంతకీ అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుంటే..

ఈ వారం కంటెస్టెంట్ అఖిల్ ‘ప్రియా ప్రియా చంపొద్దే’ అనే పాటను పాడతాడు. ఇంతలోనే ఈ షోలోకి ‘నేనింతే’ సినిమా హీరోయిన్ అతిథి వచ్చేస్తుంది. ఈ బ్యూటీ అఖిల్ పాడిన పాటకు ఫిదా అయిపోతుంది. ఎంతలా అంటే ఆ హీరోయిన్ ఆ పాటలోని ఒక చరణాన్ని మళ్లీ అఖిల్ తో పాడించుకుంటుంది. అనంతరం అతడితో కలిసి స్టెప్పులు కూడా వేస్తుంది. అంతలోనే శ్రీముఖి సీన్ లోకి ఎంట్రీ ఇస్తుంది. నేనింతే సినిమాలో రవితేజను తిడతారు కదా… ఇప్పుడు ఆ తిట్లే మేం మీ నోటి నుంచి వినాలనుకుంటున్నాం అని అన్నట్లుగా శ్రీముఖి అతిథితో అంటుంది.

ఆ డైలాగ్ చెప్పేందుకు సరేనన్నట్టు అతిథి తల ఊపుతుంది. అనంతరం “రవితేజగా ఎవరు నటిస్తారు మరి?” అని ప్రశ్నిస్తుంది. అప్పుడు శ్రీముఖి బదిలిస్తూ సింగర్ సాకేత్ పేరు చెబుతుంది. దాంతో అతడు ఒక్కసారిగా కంగు తింటాడు. ఆ తర్వాత చేసేది లేక రవితేజ పాత్ర చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత స్టేజ్ మీదకు వచ్చి హీరోయిన్‌ను ఉద్దేశించి నీ పిచ్చి ఏంటి అని అడుగుతాడు. దాంతో అతిథి రిప్లై ఇస్తూ.. ‘పిచ్చి ఏంటని నన్ను అడగొద్దు రా.. నువ్వే రా నా పిచ్చి..పిచ్చి నా కొడకా’ అంటూ సాకేత్ ని తిట్టేస్తుంది. అలా రవితేజ పాత్ర లో ఉన్న సాకేత్ ని ఘోరంగా ఆమె తిట్టడం జరిగింది.

Share post:

Latest