హీరో విజయ్ ఇల్లు అన్ని కోట్లా..ఇంద్రభవనం మించిపోయేలా ఉందిగా..!?

కోలీవుడ్ స్టార్ హీరోలో ఒకరైన దళపతి విజయ్ కు త‌మిళ్‌ తో పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ చేసిన సినిమాలన్నీ ఎక్కువ శాతం సూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. తమిళ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలు ఎవరిని చేసిన సర్వేలలో ఎక్కువ శాతం విజయ్ అని సర్వేలు తేల్చాయి. ఇతర హీరోలకి ..విజయ్ అభిమానులు షాక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ వ‌రుస‌ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా విజయ్ ఒక లగ్జరీ అపార్టుమెంట్ ను కొనుగోలు చేశాడు.

I-T raids continue on second day at Thalapathy Vijay's residence

ఇక ఈ క్రమంలోనే విజయ్ కొన్న అపార్ట్మెంట్ పై సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. విజయ్ చెన్నైలోనే భారీ ఖరీదైన ప్రాంతంలో ఓ లగ్జరీ ఇంటిని కొన్నాడట.ఈ ఇంటి కోసం విజయ్ భారీగా ఖర్చు చేశారని తెలుస్తుంది. ఏకంగా 50 కోట్ల వరకు విజయ్ ఈ లగ్జరీ ఇల్లు కోసం ఖర్చు చేశారనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే విజయ్ ఇప్పటివరకు ఈస్ట్ కోస్ట్ రోడ్ లల్లో తన కుటుంబంతో నివసించాడు.

Thalapathy Vijay Dedicated This Song From His Film for Wife Sangeetha | Astro Ulagam

అయితే ఈ ప్రాంతంలో రద్దీ పెరగడంతో విజయ్ కొత్త ఇంటిని కొన్నట్లు తెలుస్తుంది. ఈ ఇల్లు ఇంద్ర భవనం లాగా ఉంటుందని ఈ ఇల్లు మొత్తంగా 20 ఎకరాల్లో ఉందని తెలుస్తుంది. ఇంత భారీ ఇంటిని విజయ్ కొనుక్కున్న విషయం తమిళ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నిర్మాత దిల్ రాజు ఈ సినిమా ఖర్చు విషయంలో రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ కొనుగోలు చేసిన భవనంలో స్టార్ హీరో ఆర్యకు కూడా ఓ ఫ్లాట్ ఉందనే సమాచారం అందుతుంది.

Share post:

Latest