అప్పుడు ఏడ్చాను.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన హీరో నిఖిల్

యంగ్ హీరో నిఖిల్ డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తు్న్నాడు. వినూత్నమైన కథలతో టాలీవుడ్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. సినిమాకు సినిమాకు సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ యాక్టర్ గా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు నిఖిల్. రోటీన్ సినిమాలు, రోటీన్ కథ కాకుండా వినూత్నంగా సినిమాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. త్వరలో కార్తికేయ-2 సినిమాతో నిఖిల్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

2014లో నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ సినిమా సూపర్ హిట్ అయింది. డిఫరెంట్ కథతో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులకు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ను అందింది. చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. ప్రస్తుతం దానికి సీక్వెల్ గా కార్తికేయ-2 తెరకెక్కింది. ఈ సినిమాకు సంబంధించి పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్స్ సినిమాపై మిరంత ఆసక్తిని పెంచేశాయి. ఈ నెలలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే థ్యాంక్యూ సినిమా ఉండటం వల్ల నిఖిల్ తన సినిమా రిలీజ్ ను వాయిదా వేసుకున్నాడు.

అయితే కార్తికేయ-2 ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల ప్రతిసారి ఇలాగే వాయిదా పడుతూ వస్తుంది. దీంతో సినిమాల విషయంలో జీవితంలో మొదటిసారి తనకు ఏడుపు వచ్చిందని నిఖిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. సినిమా వాయిదా పడుతుండటంతో రిలీజ్ పై భయం వేసిందని, ఏడుపు వచ్చిందని చెప్పుకొచ్చాడు. లైఫ్ లో మొదటిసారి సినిమా కోసం ఏడాచ్చానిన ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు.

జులై 1న విడుదల చేయాలని అనుకున్నామని, కానీ నాగచైతన్య థ్యాంక్యూ సినిమా వచ్చిందన్నాడు. దిల్ రాజ్ కోరిక మేరకు తమ సినిమాను వాయిదా వేసుకున్నట్లు నిఖిల్ తెలిపాడు. ఇక ఆగస్టు 1న విడుదల చేద్దామని అనుకుంటే.. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న బింబిసార సినిమా వస్తుందన్నాడు. దీంతో అప్పుడు విడుదల చేస్తే కలెక్షన్లపై ప్రభావం పడుతుందని భావించింది ఆగస్టు 12కు రిలీజ్ డేట్ ను మార్చామన్నాడు.

అప్పుడు కూడా నితిన్ సినిమా ఉందని, థియేటర్లు ఇస్తారో .. లేదో అర్ధం కావడం లేదన్నాడు. హ్యాపీడేస్ సినిమా దగ్గర నుంచి థియేటర్ల సమస్య గురించి తాను ఎప్పుడూ పట్టించుకోలేదని, తొలిసారి సినిమాల విషయంలో ఏడుపు వచ్చిందని నిఖిల్ తెలిపాడు. ఎట్టకేలకు ఆగస్టులో విడుదల చేస్తామని, ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉందని నిఖిల్ తెలిపాడు. దిల్ రాజు, ఏషియన్ సునీల్ థియేటర్ల విషయంలో సహాయం చేస్తున్నారని చెప్పుకొచ్చాడు.

Share post:

Latest