డీజే టిల్లు లో రాధిక మారిపోయిందా.. మరొక హీరోయిన్ ఎవరంటే..!!

టాలీవుడ్ కుర్ర హీరోలు ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బాగా బిజీగా ఉన్నారు. సరికొత్త కథలతో సూపర్ హిట్స్ అందుకుంటూ ఉన్నారు. ఇక ఇలాంటి వారిలో డీజే టిల్లు సినిమా హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా ఒకరిని చెప్పవచ్చు. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కంప్లీట్ గా కామెడీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులకి మరింత వినోదాన్ని పంచిందని చెప్పవచ్చు. ఇక ఇందులో సిద్దు కామెడీ టైమింగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా సీక్వెల్ రాబోతున్నట్లు సమాచారం.DJ Tillu Teaser | Siddhu, Neha Shetty | Vimal Krishna | S Naga Vamsi | Sri  Charan Pakala - YouTube

ఇదంతా ఇలా ఉండగా డీజే టిల్లు సినిమాలో నటించిన హీరోయిన్ నేహా శెట్టి రాధికా పాత్రలో అద్భుతంగా నటించిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్లో ఈమె నటించబోదు అన్నట్లుగా సమాచారం. నేహా శెట్టి ప్లేస్ లో ఒక స్టార్ హీరోయిన్ అనుకుంటున్నట్లుగా సమాచారం. రాధిక పాత్ర సీక్వెలలో మలయాళం హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇక హీరోతో పోటీగా ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉండడంతో అనుపమ కూడా ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.Anupama Parameshwaran in DJ Tillu Sequel

ఇప్పటికే తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనుపమ తాజాగా తను నటించిన కార్తికేయ -2 సినిమా మంచి విజయాన్ని అందుకుంది.. త్వరలోనే 18-పేజెస్ సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తున్నారు. ఇక డీజే టిల్లు సినిమా సీక్వెల్ లో అనుపమ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిందా అనే విషయంపై చిత్ర క్లారిటీ ఇవ్వాల్సి ఉన్నది. మరి ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో ఓకే చెప్పినా ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో అంటూ ఆమె అభిమానుల సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Share post:

Latest