ఘనంగా ఆలీ కూతురు నిశ్చితార్థ వేడుకలు.. వీడియో వైరల్..!

ప్రముఖ కమెడియన్ గా, హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఆలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన నటనతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా మంచి ఇమేజ్ను కూడా సొంతం చేసుకున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో ఈయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇంత డిమాండ్ ఉంది కాబట్టి ఈయన అంత ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు అంతేకాదు ఒక్కరోజు కాల్ షీట్ ఇస్తే ఈయన పారితోషకం కింద రూ.3లక్షలకు పైగా పారితోషకం తీసుకుంటాడు అని సమాచారం.. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తూ ఎంతో మంది సెలబ్రిటీలను అలరిస్తూ మురిపిస్తూ ఉంటారు.

ఇదిలా ఉండగా ఈయన భార్య జుబేదా కూడా అందరికీ బాగా పరిచయస్తురాలు. ఈమె జుబేదా అలీ పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ ను ఓపెన్ చేసి అందులో హోమ్ టూర్ , పలువంటల వీడియోలు , అలాగే సెలబ్రిటీలతో తాను గడిపిన సమయాన్ని, ఒక్కొక్కసారి సినిమా షూటింగ్లో ఆ సినిమాకు సంబంధించి పలువురు నటీనటులను ఇంటర్వ్యూలు చేస్తూ బాగా ఫేమస్ అయింది. ఇకపోతే వీరి కుటుంబ విషయానికి వస్తే ఆలీ దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల కూతురుకి నిశ్చితార్థ వేడుకలు చాలా ఘనంగా జరిపించినట్లు జుబేదా ఆ వీడియోను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేసుకుంది.

గత కొద్ది రోజుల క్రితం నిశ్చితార్థానికి సంబంధించిన బంగారు ఆభరణాలు, చీరలు వంటివి షాపింగ్ చేసి ఆ వీడియోలను ఆమె యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేయగా.. వాటికి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా లక్షల కొద్ది వ్యూస్ కూడా వచ్చాయి. ఇక ఈ క్రమంలోనే తమ కూతురు నిశ్చితార్థ వేడుకలకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది జుబేదా.. ఈ వీడియో గనుక మనం చూసినట్లయితే చాలా అంగరంగ వైభవంగా నిశ్చితార్థ వేడుకలను ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో జరిపినట్లు తెలుస్తోంది. ఆలీ బంధువులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం హాజరయ్యారు. ఇక వీడియో మీరు కూడా చూసేయండి.

Share post:

Latest