దయచేసి..పిల్లల్ని కనండి ప్లీజ్..గవర్నమెంట్ స్పెషల్ రిక్వెస్ట్..ఎందుకంటే..!!

ఎస్ ..ఇప్పుడు ఇదే రిక్వెస్ట్ చేస్తుంది చైనా గవర్నమెంట్ వాళ్ళ దేశ ప్రజలను. ఒకప్పుడు జనాభాలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం గా రికార్డ్ సృష్టించిన చైనా ..ఇప్పుడు కనీస జనాభా సంఖ్యలేక అల్లాడిపోతుంది . దానికి కారణాలు కరోనా కావచ్చు కాకపోవచ్చు.. కానీ, ప్రజెంట్ అక్కడ జనాభా సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో దేశ జనాభాను పెంచుకోవడానికి చైనా గవర్నమెంట్ నానా తంటాలు పడుతుంది.


ప్రజెంట్ జనాభా శాతం చూస్తే చాలా తక్కువగా ఉందంటూ చైనా వర్గాలు బాధపడుతున్నాయి. ఇదేవిధంగా కొనసాగితే 2025 నాటికి చైనా జనాభా దాదాపు సగం శాతం పడిపోతుందని చైనా గవర్నమెంట్ అంచనా వేస్తుంది. దీంతో జనాభాను ఎలాగైనా సరే పెంచడానికి చైనా గవర్నమెంట్ కొత్త కొత్త పథకాలను అమలులోకి తెస్తుంది. మనకు తెలిసిందే ఒకప్పుడు చైనా జనాభా చాలా ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. కానీ రాను రాను ఈ జనాభా సంఖ్య రేటు తగ్గుముఖం పట్టింది. ఐదేళ్లలో జనాల జనాభా రేటు చాలా విపరీతంగా పడిపోయింది అంటున్నారు చైనా విశ్లేషకులు.

చైనా జనాభా తగ్గడానికి కారణాలు ఏంటా అని సర్వేలు నిర్వహిస్తే..షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పెరుగుతున్న కాలానికి.. మారుతున్న ట్రెండ్ కి.. పెరిగిపోతున్న ఖర్చులకి ఆదాయం సరిపోక జనాభా.. ఒక బిడ్డనే చాలు అనుకుంటున్నారట. దీనికోసమే రెండో బిడ్డను కనడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు . ఈ క్రమంలోనే చైనా జనాభా భారీ సంఖ్యలో తగ్గుముఖం పట్టింది. చైనా జనాభాను పెంచడానికి.. కొత్త చట్టాలను అమల్లోకి తెస్తుంది గవర్నమెంట్. జనాభా సంఖ్యను పెంపొందించడానికి చైనా కొన్ని చర్యలు ప్రారంభించింది . ఈ చర్యలలో భాగంగానే మెరుగైన ప్రసూతి సంరక్షణ సేవలు.. పబ్లిక్ బెనిఫిట్ చైల్డ్ కేర్ సేవలు.. తల్లిదండ్రులకు సెలవులు ఇవ్వడం లాంటివి చేస్తూ వస్తుంది చైనా.

చైనా జనాభాను పెంపొందించడానికి చైనా గవర్నమెంట్ మైకుల్లో అనౌన్స్ చేస్తూ..” పిల్లలు కనండి మన దేశాభివృద్ధిని పెంచండి” అంటూ గవర్నమెంట్ సరికొత్త విధానాన్ని అమలులోకి తెస్తుంది. ప్రజెంట్ చైనా జనాభా సమస్య మరింత తీవ్రమవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో చైనా దేశం అంతరించిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే చైనా గవర్నమెంట్ కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది.