సావిత్రి గారి సమాధి మీద ఏం రాశారో తెలుసా…మహానటికి దండం పెట్టాల్సిందే..!

మహానటి సావిత్రి తెలుగు సినిమా రంగంలో మ‌కుటం లేని మ‌హారాణి. ఆమె త‌న అస‌మాన న‌ట‌న‌తో తెలుగు గ‌డ్డ‌పై ల‌క్షలాది మంది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానుల‌ను చేసుకుంది. సావిత్రి అంటే సినిమాల్లో న‌టించ‌దు.. జీవించేస్తుంది. ఆమె తెర‌మీద న‌టిస్తుంటే ప్రేక్ష‌కులు ఆమె న‌ట‌న‌లో లీన‌మైపోయేవారు. ఆమె చ‌నిపోయి ఇన్ని సంవ‌త్స‌రాలు అవుతున్నా ఇప్ప‌ట‌కీ సావిత్రిని మ‌నం మ‌ర్చిపోలేదు అంటే ఆమె వెండితెర పాత్ర‌ల ద్వారా ఎంత చెర‌గ‌ని ముద్ర వేశారో అర్థ‌మ‌వుతోంది.

కేవలం నటిగానే కాకుండా, నిర్మాతగా, దర్శకురాలిగా తెలుగు తెరపై చెరగని ముద్రవేసింది సావిత్రి. స్టార్ హీరోలకు ధీటుగా నటించిన ఆమెతో నటించాలంటే జాగ్రత్త పడేవారు. సావిత్రి నట జీవితం గురించి మాట్లాడితే దిగ్గజ నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీ రంగారావు వంటి వారు కూడా ఆమెతో పాటు నటించేటప్పుడు ఎలెర్ట్‌గా ఉండేవార‌ట‌.

సావిత్రికి సినిమా జీవితంలో తిరుగులేక పోయినా వ్య‌క్తిగ‌త జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన చివరి దశలో చాలా ఇబ్బందులు అనుభవించింది. మితిమీరిన దాన‌ధ‌ర్మాల‌తో సావిత్రి తన చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. జెమినీ గ‌ణేష‌న్‌ను పెళ్లి చేసుకోవ‌డ‌మే ఆమె చేసిన పెద్ద త‌ప్పు.
సావిత్రి తను చనిపోయాక తన సమాధిపై ఏమని రాయాలో వివరించిందట. చావులోనూ, జీవితంలోనూ ఒక మహోన్నతమైన తార ఇక్కడ శాశ్వతమైన విశ్రాంతిని తీసుకుంటుంది.

 

ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా సానుభూతితో కన్నీళ్లు పెట్టవద్దు. ఈ సినీ పరిశ్రమలో కూడా ఎవరు ఈ హీనంగా చూడకుండా మరణం లేని ఆ సమాధిలో నిద్రిస్తున్న మహా ప్రతిభకు ఒక పూలమాలను ఉంచండి. ఇదే మీరు నాకు ఇచ్చే గౌరవం అని సావిత్రి అన్నారట. ఆవిడ చివ‌రి కోరిక మేర‌కు ఆమె స‌మాధిపై అలాగే రాశారు.

Share post:

Latest