జూనియర్ ఎన్టీఆర్ ఫిట్ ఉండడానికి కారణం ఏంటో తెలుసా?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాలనాటుడిగా తన కెరీర్ ను మొదలుపెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ , సింహాద్రి, యమదొంగ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా నిన్ను చూడాలని అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోగా పరిచయమైన ఈయన అప్పటినుంచి ఇప్పటివరకు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించడమే కాకుండా సినిమా సినిమాకు తనలో ఉన్న మేకోవర్ ను చేంజ్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పడంలో సందేహం లేదు.Naga Chaitanya, Ram Charan, Junior NTR, Rana: T'wood stars reveal love for  cooking

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఒక సినిమాలో చూపించిన లుక్ , ఫిట్నెస్ ఇంకొక సినిమాలో ఉండదని చెప్పవచ్చు అలా ప్రతి సినిమాకు తన మేకోవర్ ను చేంజ్ చేసుకుని ఏకైక హీరో ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఇకపోతే ఎన్టీఆర్ ను అలా చూసిన ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ ఇంత ఫిట్గా ఉండడానికి ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నారు అనేది అందరి మది లో మెదిలే ప్రశ్న ..అయితే ఇప్పుడు ఆయన అలా ఫిట్గా ఉండడానికి గల కారణం ఏమిటో ఒకసారి చదివి తెలుసుకుందాం.Young Tiger NTR Gym Workout Video | Jr NTR Gym Workouts | TFPC - YouTubeఎన్టీఆర్ ముఖ్యంగా తన బాడీని మెయింటైన్ చేయడం కోసం డైట్ విషయంలో చాలా కఠినంగా ఉంటారట. ఇక ప్రతి మూడు గంటలకు ఒకసారి ఆహారం తీసుకుంటూ ఉంటారు. డైట్ లో భాగంగానే ఎగ్ వైట్స్, ఉడకబెట్టిన చికెన్, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటారట. అంతేకాదు తను తినే ఆహారంలో కచ్చితంగా విటమిన్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవడంతో పాటు ఫ్యాట్ తక్కువగా ఉండేలా చూసుకుంటూ ఉంటారు ఎన్టీఆర్.

ముఖ్యంగా తమ ఫిట్నెస్ ట్రైనర్ చెప్పిన డైట్ ని ఆయన ఫాలో అవుతూ ఉంటారు. ఇక ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడానికి వాల్నట్ , బాదంపప్పు భోజనానికి ముందు తీసుకుంటారట. ఇక అంతేకాదు ప్రతిరోజు డైట్ లో కచ్చితంగా పండ్లు ఉండేలాగా చూసుకోవడం తప్పనిసరి . ఇక గంటసేపు వ్యాయామం చేస్తారు.. ఇక వర్క్ అవుట్ చేయడానికి జిమ్ కి వెళ్తూ ఉంటారు. అందుకే ఆయన శరీరం అంత ఫిట్ గా ఉంటుందని చెప్పవచ్చు.

Share post:

Latest