అల్లు అర్జున్ ఆస్తి విలువ ఎన్ని కోట్ల తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా అల్లు రామలింగయ్య ప్రముఖ హాస్య నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడమే కాకుండా హోమియోపతి డాక్టర్ గారు కూడా మంచి గుర్తింపున సంపాదించుకున్నారు . ఆయన ఎన్టీఆర్ , ఏఎన్నార్ లాంటి గొప్ప నటులకి కూడా హోమియోపతి డాక్టర్గా పనిచేయడం జరిగింది. ఇక ఆయన వారసుడు అల్లు అరవింద్ ఒకటి రెండు సినిమాలలో నటించి ఆ తర్వాత నిర్మాణరంగం వైపు అడుగులు వేశారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలకు గీత ఆర్ట్స్ బ్యానర్ పై సమర్పకుడిగా అల్లు అరవింద్ వ్యవహరించడం జరిగింది. ఇకపోతే ఈయన వారసులు అల్లు బాబి, అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇలా ముగ్గురు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కానీ వీళ్ళల్లో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం.Allu Arjun Wife Age Height Family Photos Biography Biodata

రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అల్లు అర్జున్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అంతే కాదు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కూడా ఈయన కోసం ఎదురుచూస్తోంది అంటే ఇక ఆయన రేంజ్ ఎంతో మనం ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. సినిమాల ద్వారా పలు కమర్షియల్ యాడ్స్ ద్వారా, రియల్ ఎస్టేట్ రంగం ఇలా పలు రకాల రంగాలలో పెట్టుబడులు పెట్టి కొన్ని వందల కోట్లు సంపాదించాడు అని సమాచారం. మరి అల్లు అర్జున్ సంపాదన ఎంత? ఏ ఏ రంగంలో పెట్టుబడులు పెట్టారు? అనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.Ram Charan, Allu Arjun and entire Mega family reunite for Christmas. See  pic - Movies Newsఅల్లు అర్జున్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 50 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక అల్లు అర్జున్ కార్ గ్యారేజ్ లో ఉన్న కార్ కలెక్షన్ విషయానికి వస్తే ఆయన దగ్గర సుమారుగా 8 లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. వీటి ఖరీదు సుమారుగా రూ.30 కోట్ల పైనే ఉంటుందని అంచనా.. అంతేకాదు ఈయన దగ్గర ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఫాల్కన్ వ్యానిటీ కార్వాన్ కూడా ఉంది .దీని ధర సుమారుగా 8 కోట్ల రూపాయలు పైనే ఉంటుందని సమాచారం. అంతేకాదు ఈయనకు ప్రైవేటు స్పేస్ జెట్ కూడా ఉండడం గమనార్హం. దీని ఖరీదు సుమారుగా 30 కోట్ల రూపాయలు.

ప్రస్తుతం హైదరాబాద్ ఫిలింనగర్ లో అల్లు అర్జున్ నివసిస్తున్నారు. ఇక మొత్తంగా అల్లు అర్జున్ ఆస్తి విషయానికి వస్తే సుమారుగా రూ.500 కోట్లకు పైగా ఆస్తిపాస్తులు ఉన్నట్లు సమాచారం.

Share post:

Latest