ఆ స్టార్ హీరోయిన్‌తో బాల‌య్య ల‌వ్‌స్టోరీ మీకు తెలుసా…!

టాలీవుడ్ సీనియర్ హీరో నట‌సింహ నందమూరి బాలకృష్ణ చాలా ప్రత్యేకమైన మనిషి. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయినదిచిన్నపిల్లాడి మనస్తత్వం. తనకి ఏది అనిపిస్తే అది చేస్తారు.. అదే మాట్లాడ‌తారు. బాల‌య్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నాడు. ఇక బాలయ్య ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయన కాకినాడ‌కు చెందిన‌ వసుంధర దేవిని పెళ్లి చేసుకున్నాడు. అయితే బాల‌య్య‌కు పెళ్లికి ముందే ఓ హీరోయిన్‌తో ప్రేమాయ‌ణం ఉంద‌ట‌. ఇది చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు.

అప్ప‌ట్లో ఓ హీరోయిన్ ని బాలయ్య సీరియస్‌గా లవ్ చేశారట. సీనియర్ ఎన్టీఆర్ గారి నట వారసుడుగా తెలుగు సినిమాల్లోకి అరంగేట్రం చేసిన బాలయ్య టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరిగా ఉన్నాడు. ఇటు రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా ఉన్నారు. ఆయ‌న‌ హీరో ఆయన కొత్తలో సూపర్ హిట్ సినిమాలు తీశారు. బాలయ్య నటించిన సినిమాలు సూపర్ హిట్లయి ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసాయి. ఆ టైంలోనే మద్రాస్‌కు చెందిన ఓ స్టార్ హీరోయిన్‌ను బాలయ్య సీరియస్ గా లవ్ చేశారట. ఈ విషయం తన అన్న హరికృష్ణ, తండ్రి ఎన్టీఆర్‌కు తెలిసింది.

దాంతో వారు బాలకృష్ణకు తొందరగా పెళ్లి చేసేయాల‌ని డిసైడ్ అయ్యారు. వెంట‌నే వసుంధరను బాలయ్యకి ఇచ్చి పెళ్లి జరిపించారు. బాలయ్య నిజంగానే చెన్నైకు చెందిన హీరోయిన్ లవ్ చేశానని తన స్నేహితులతో తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో అప్పుడప్పుడు చెప్పే వారట. ఈ విషయాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాకుండా ఎన్టీఆర్ రాజకీయ శత్రువు అయిన నాదెండ్ల భాస్కరరావు సైతం ఓ ఇంటర్వ్యూలో బాలయ్య ఓ హీరోయిన్‌ను ల‌వ్ చేశార‌ని చెప్పారు.

బాలయ్య ఈ విషయం అప్పుడప్పుడు సెట్లో సిల్లీగా చెప్పేవారిని సమాచారం. ఇంకా బాలయ్య సినిమాల విషయానికొస్తే గ‌త‌ సంవత్సరం అఖండతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాంచి ఊపు ఇచ్చాడు. ప్రస్తుతం బాలకృష్ణ తన 107వ‌ నిమా షూటింగ్ బిజీలో ఉన్నాడు. ఈ సినిమాకి జై బాలయ్య అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Share post:

Latest