ఓ మ్యాగజైన్ కవర్ పేజీకోసం రెచ్చిపోయిన దిశా ప‌టానీ.. వైరల్ అవుతున్న హాట్ పిక్స్!

దిశా ప‌టానీ.. అంటే ఎవరో తెలియని కుర్రకారు ఉండరనే చెప్పుకోవాలి. అమ్మడు ఇండియన్ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే తన ప్రతాపమేంటో చూపించింది. దాంతో చిన్న హీరోలనుండి అగ్రహీరోల వరకు అందరితోనూ బి టౌన్లో అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది. అవసరమైనపుడు అందచందాలను ఆరబెట్టడంలో అమ్మడు ఏమాత్రం సిగ్గు పడదు. సోష‌ల్ మీడియాలో క‌నీసం ఒక్క‌సారైనా హాట్ ఫోటోలను అప్‌లోడ్ చేయకపోతే ఈ భామకు నిద్ర పట్టదు. ఓ రకంగా చెప్పాలంటే అందాల ఆరబోతలో ఈ భామను మించిన వాళ్లు ఈ తరంలో లేరనే చెప్పుకోవాలి.

ఈమెకి ఇప్పటికే సోషల్ మీడియాలో 52.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అంటే అమ్మడి ప్రతాపం ఏపాటిదో అర్ధం చేసుకోండి. ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటించడం కూడా దిశాకు మంచి అలవాటు. తమకు సంబంధించిన విషయాలను వాళ్లకు చెప్తూ వాళ్ళతో ఎప్పుడూ కాంటాక్ట్ అవుతుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం వల్ల ఫాలోయింగ్ ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదు. అందుకే స్టార్స్ అంతా ఈ రోజుల్లో ఎక్కువగా సోషల్ మీడియాలోనే సమయం ఎక్కువగా గడుపుతుంటారు. ఏ మాత్రం టైమ్ దొరికినా కూడా వెంటనే ట్విట్టర్, ఇన్‌స్టాలోకి వచ్చేసి తమ అభిమానుల ముందు వాలిపోతుంటారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘లోఫర్’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దిశా పటాని దగ్గరైంది. ఆ చిత్రంలో దిశా అందాల ఆరబోతకు అందరూ ఫిదా అయ్యారు. అయితే ఆ సినిమా తరువాత అమ్మడు ఇక్కడ బిజీ అవ్వాల్సింది పోయి, బాలీవుడ్లో బిజీ అయింది. ఇపుడు ప్రభాస్..ప్రాజెక్ట్ K లో సెకండ్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. బాలీవుడ్ లో మాత్రం టైగర్ ష్రాఫ్ నుండి సల్మాన్ లాంటి సీనియర్ హీరోల వరకు అందరితో సినిమాలు చేస్తూ నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తుంది. దిశా సినిమాలతో పాటు మరో చేత్తో సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గర్ల్ అనిపించుకుంది.

Share post:

Latest