రామ్ చరణ్ RC15 పై ఫోకస్ తగ్గిస్తున్న డైరెక్టర్ శంకర్!

శంకర్ డైరెక్షన్లో సినిమా చేయాలనీ ప్రతి హీరో ఆశ పడుతుంటారు.అయన చేసే సినిమాలు ఎప్పుడూ వైవిధ్యంగ ఉంటాయి. అయితే ఈ మధ్య శంకర్ సినిమా షూటింగ్ ప్లానింగ్ విషయంలో చాల కన్ఫ్యూషన్ లో వున్నారనిపిస్తుంది. ఎందుకంటే శంకర్ 2 సంవత్సరాల క్రితం కమల్ తో ఇండియన్2 మొదలుపెట్టారు. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో పెద్ద ప్రమాదం జరగటం,తర్వాత నిర్మాణ సంస్థ తో శంకర్ కి విబేధాలు రావటం వల్ల షూటింగ్ ఆగిపోయింది. .కొన్నాళ్ల తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో RC15 మొదలుపెట్టారు శంకర్. తర్వాత కొన్ని రోజులకు అపరిచితుడు హిందీ లో తీయటం ప్రారంభించాడు. ఇలా అంత గజిబిజి గ సినిమాలు ప్లాన్ చేసాడు శంకర్.

ఇదిలా నడుస్తుండగా అయన కి ఇంకొక సమస్య ఎదురయింది. Indian2 నిర్మాణసంస్థ అయన మీద కోర్ట్ లో పిటిషన్ వేసింది. దాంతో అయన వెంటనే అన్ని సినిమాలు ఆపేసి Indian2 పూర్తి చేస్తారని అందరూ ఆశించారు. రామ్ చరణ్ సినిమా ఆగిపొతుందెమో అని మెగా ఫాన్స్ నిరాశలో వున్నారు..అయితే శంకర్ మళ్ళీ అందరి అంచనాలు తారుమారు చేస్తూ Indian2 & RC15 రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ జారుపుకుంటాయని చెప్పారు..ఇలా శంకర్ చేస్తున్న ఈ రెండు పడవల ప్రయాణం ఏమవుతుందో అని ఇటు చరణ్ ఫాన్స్ ,అటు కమల్ ఫాన్స్ ఆందోళన పడుతున్నారు..ఎందుకంటే రెండు భారీ ప్రాజెక్ట్స్ ఒకేసారి చేయటం అంటే చాల ప్రెషర్ ఉంటుంది కదా.

Share post:

Latest