యాంకర్ రష్మీ బ్రేకప్ కథ విన్నారా? ప్రేమికుడు సుడిగాలి సుధీర్ ఇదంతా చేశాడా?

యాంకర్ రష్మీ గురించి తెలియని తెలుగు కుర్రకారు ఉండరనే చెప్పుకోవాలి. మల్లెమాల సమర్పణలో వచ్చిన జబర్దస్త్ అనే ప్రోగ్రాం ద్వారా అనసూయ తరువాత ఆ స్థానాన్ని భర్తీ చేసిన ఘనత యాంకర్ రష్మిదే. అంతకుముందే ఈమె అడపాదడపా సినిమాలలో నటించినప్పటికీ, ఈమెకి గుర్తింపు మాత్రం ఈ షో ద్వారా మాత్రమే ఏర్పడింది. ఇక పండగ సందర్భాలలో ఈటీవీలో ఈవెంట్ వస్తోందంటే.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. త్వరలో వినాయక చవితి కావున అనేక షోస్ సందడి చేయనున్నాయి.

ఈ సందర్భంగా ఈటీవీలో రిలీజ్ చేసిన ప్రోమోలో రష్మీ అందరినీ కట్టిపడేసింది. రష్మీకి ఇది వరకే పెళ్లి అయిందని, ప్రేమికుడు వున్నాడని… అంటూ ఏవేవో పిచ్చి పిచ్చి కథనాలు వస్తుంటాయి. ఇకపోతే రష్మీ తల్లిదండ్రులు విడిపోయారు అనే సంగతి చాలా కొద్దిమందికి తెలుసు. రష్మీని చిన్నతనం నుంచి కూడా తన అమ్మే పెంచి పోషించి పెద్ద చేసింది. తండ్రి ప్రేమ అంటే ఏంటో తనకు తెలీదని రష్మీ స్టేజ్ మీదే ఎన్నో సార్లు కంటతడి పెట్టుకుంది. అలాంటి రష్మీ ఇప్పుడు బ్రేకప్ బాధను తాజా ప్రోమోలో అందరికీ అర్థమయ్యేలా చెప్పి కంటతడి పెట్టించింది. రష్మీ పర్ఫామెన్స్ చూస్తే నిజంగానే తనకు బ్రేకప్ జరిగిందా? అనే అనుమానం కలిగించేస్తోంది.

గతంలో ఆమెని సుధీర్‌ను పెళ్లి చేసుకో అని అభిమానులు పదే పదే అడుగుతుండటంతో రష్మీ ఈ విధంగా స్పందించడం మనకు తెలిసినదే… తాను ఏది చేసినా కూడా జనాలను ఎంటర్టైన్ చేసేందుకేనని చెప్పి ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చింది. తెరపై చూపించేది నిజం కాదని చెప్పుకొచ్చింది. తామిద్దిరం కేవలం జస్ట్ ఫ్రెండ్స్‌ మాత్రమేనని, స్క్రీన్ మీద కేవలం ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకే అలా నటిస్తామని తెలిపింది. అయితే రష్మీకి లవ్ స్టోరీ ఉందని, బ్రేకప్ జరిగిందనేది రూమరా? నిజమా? అన్నది తెలియడం లేదు. కానీ తాజాగా ఆమె డ్యాన్స్ పర్ఫామెన్స్ చూసి అందరూ షాక్ అయ్యారు.

Share post:

Latest