లైగర్ చిత్రం విషయంలో ఆ తప్పు చేయకుంటే.. బాగుండేదంటున్నా ఛార్మి..!!

ఈనెల 25న థియేటర్లలో విడుదలైన లైగర్ చిత్రం ప్రేక్షకుల నుంచి డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక కథ పరంగా బెడిసి కొట్టినట్టుగానే కలెక్షన్ పరంగా కూడా ఈ సినిమా భారీ నష్టాన్ని తెచ్చి పెట్టింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో.. విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఇది. ఇకపోతే దాదాపుగా 90 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లో కేవలం 23 కోట్ల రూపాయలు షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి.Actress Charmi Kaur to Appear before ED | INDToday

ఫుల్ రన్ లో ఈ సినిమా 30 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం కూడా కష్టమేనని కామెంట్ లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే లైగర్ సినిమా నిర్మాతలలో ఒకరైన ప్రముఖ హీరోయిన్ ఛార్మి ఈ సినిమా రిసల్ట్ పై స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.. ఛార్మీ మాట్లాడుతూ ప్రేక్షకులు ఇంట్లో కూర్చొని ఒక క్లిక్ తో కంటెంట్ చూసే అవకాశం ఉంది. ఫ్యామిలీతో సహా టీవీలో అత్యంత భారీ బడ్జెట్ తో సినిమాలను చూడవచ్చని ఆమె చెప్పుకొచ్చింది. ఇకపోతే సినిమాలు ప్రేక్షకులను ఎగ్జైట్ చేయనంత వరకు ఆడియన్స్ థియేటర్లకు రావడానికి ఇష్టపడరు .బాలీవుడ్ విషయంలో మాత్రం ఈ సూత్రం వర్తించదు అని ఆమె తెలిపింది.20 years worth lost with one movie : Charmy Emotionalముఖ్యంగా సౌత్ సినిమాలంటే గతంలో ఉన్న పిచ్చి బాలీవుడ్ లో ఇప్పుడు లేదని అనిపిస్తోంది అంటూ కామెంట్లు చేసింది చార్మి. అంతేకాదు బాలీవుడ్ ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ముందు ఇతర విషయాలపై కూడా దృష్టి పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలైన సీతారామం, బింబిసారా, కార్తికేయ 2 సినిమాలు సక్సెస్ సాధించాయని ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇక లైగర్ సినిమాను బాలీవుడ్ లో విడుదల చేయకపోయి ఉంటే కచ్చితంగా ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టేది అంటూ తన అభిప్రాయంగా వెల్లడించింది. అంతేకాదు ఎన్నో మంచి ఆఫర్లను కోల్పోయి.. లైగర్ ను థియేటర్లలో విడుదల చేశాము. అయితే ఈ సినిమా ఇలాంటి ఫలితాన్ని అందుకోవడం చాలా బాధ కలిగిస్తోంది అంటూ ఛార్మీ చెప్పుకొచ్చింది.