భార్యల చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న సెలబ్రిటీస్..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు బయటకు ఎంతో హుందాగా, లగ్జరీగా, ఖరీదైన కార్లు, దుస్తులు ధరించి చాలా లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తారు అని అందరూ అనుకుంటారు. కానీ లోపల వారు పడే కష్టాలు మాత్రం చాలా మందికి తెలియదనే చెప్పాలి. ముఖ్యంగా కుటుంబ కలహాలనేవి సామాన్య ప్రజలకే కాదు సెలబ్రిటీలకు కూడా కామన్ గా మారిపోయాయి. ఈ క్రమంలోనే కుటుంబ కలహాలతో కొంతమంది విడాకులు తీసుకుంటే మరికొంతమంది మానసిక క్షోభ కి అనుభవించి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇక మరి కొంతమంది ఏకంగా గుండెపోటుతో మరణించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక ఇప్పటివరకు భార్యలు మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

ఉదయ్ కిరణ్:telugu-actor-uday-kiran-rare-photos (8) - Lovely Teluguటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలినాళ్లల్లో బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నారు. ఇకపోతే చిరంజీవి కూతురుతో నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి ఆగిపోయింది. ఇక తర్వాత విషితను వివాహం చేసుకున్నారు. అయితే విషిత ప్రవర్తన బాగాలేక ఉదయ్ కిరణ్ మార్చే ప్రయత్నం చేశాడు. అయితే విషిత తన ప్రవర్తనను మార్చుకోకపోవడం వల్లే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు అని వార్తలు కూడా వినిపించాయి. మరొకపక్క ఆర్థిక నష్టాలు కూడా ఆయన మరణానికి కారణం అని పలువురు చెబుతూ ఉంటారు.

చక్రి:Threat to my life, says Chakri's wife | Telugu Movie News - Times of Indiaప్రముఖ సంగీత దర్శకుడు చక్రి విషయంలో కూడా ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక చక్రి భార్య అనాధాశ్రమంలో బ్రతుకుతోంది అంటే తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ముఖ్యంగా చక్రి చనిపోయిన తర్వాత ఆయన తల్లి, తమ్ముడు అద్దే ఇంటికి వెళ్ళిపోతే ఆస్తి మొత్తం చక్రి భార్య అనుభవిస్తోంది. అంతేకాదు ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఆమె అమ్ముతూ ఆ డబ్బులతో ఫారిన్లో లగ్జరీగా జీవితాన్ని కొనసాగిస్తుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇకపోతే చనిపోవడానికి ముందు రోజుల్లో భార్యతో తీవ్రమైన మనస్పర్థలు రావడంతో ఒత్తిడి ఎక్కువై ఆయన గుండెపోటుతో మరణించారు అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Share post:

Latest