సీతారామం VS బింబిసార: చిరంజీవి మెచ్చిన సినిమా ఏది అంటే…?

వావ్..చాలా రోజుల తరువాత బాక్స్ ఆఫిస్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. అసలే ఆగస్టు నెల అంటే అందరి శుభారంభం. అందరు బోలెడు ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుని కొత్త పనులు ప్రారంభిస్తారు. ఇక సినిమా వాళ్ళు కూడా అదే సెంటిమెంట్ ను నమ్ముకుని..భారీ బడ్జెట్ సినిమాలను ఈ నెలలోనే విడుదల చేయబోతున్నారు. కాగా, బాక్స్ ఆఫిస్ వద్ద నిన్న రెండు సినిమా రిలీజ్ అయ్యాయి. ఆశ్చర్యంగా రెండు సినిమాలు సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. దీంతో కొన్నాళ్ళుగా సరైన హిట్ లేదని భాధపడుతున్న అభిమానులకు ..కొత్త హిట్ జోష్ ను నింపింది.

- Advertisement -

నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా “బింబిసార”. సినిమా మొత్తానికి వన్ మ్యాన్ ఆర్మిలా బాధ్యతలను తన భుజాన వేసుకుని కష్టపడ్డాడు ఈ హీరో. బింబిసార కోసం కళ్యాణ్ రామ్ ఎంత కష్టపడ్డాడో మనకు తెలిసిందే. సినిమా కోసం తన బాడీని మార్చేసుకున్నాడు. కఠినమైన డైలాగ్స్ ను కూడా అలవోకగా చెప్పే విధంగా తనను తాను మార్చుకునేశాడు. ఈ సినిమా చూస్తున్నంత సేపు మనం కల్యాణ్ రామ్ ని మర్చిపోతాం..ఇతనే నిజమైన బింబిసారుడు అని అనుకునేలా నటించాడు కల్యాణ్ రామ్.

రీసెంట్ గా ఈ సినిమా తమ్ముడు తారక్ కూడా ట్వీట్ చేశాడు. “బింబిసారుడిగా నిన్ను తప్ప వేరే వాళ్లని ఊహించుకోలేం..బ్రదర్..”అంటూ అన్న పర్ ఫామెన్స్ ని ఓ రేంజ్ లో పొగిడేశాడు. అయితే, తాజాగా ట్వీట్టర్ వేదికగా..మెగాస్టార్ చిరంజీవి బింబిసార సినిమా గురించి..అలాగే, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ హీరో గా నటించిన “సీతారామం” గురించి స్పందిస్తూ..రెండు సినిమాలు ఘన విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. “ప్రేక్షకులు కంటెంట్ ఉంటే సినిమాను ఆదరిస్తారని..ధియేటర్ కు వచ్చి సినిమాను చూస్తారు అని మరోసారి ఈ రెండు సినిమా లు ప్రూవ్ చేసాయి. రెండు సినిమాలు మంచి విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది”..అంటూ తన అభిప్రాయాని అభిమానులతో పంచుకున్నాడు.

 

Share post:

Popular