కన్నీళ్లు గ్యారెంటీ..ప్రభాస్ ఖాతాలో మరో బాహుబలి..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. బాహుబలి సినిమాలు తర్వాత ప్రభాస్ రేంజ్ మొత్తం మారిపోయింది. వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయాడు. ఆయన చేస్తున్న సినిమాలు కంప్లీట్ అవ్వడానికి మరో రెండు- మూడు సంవత్సరాలు పడుతుంది. కానీ ప్రభాస్ తో సినిమా చేయడానికి ఎక్కువ మంది దర్శకులు ఆసక్తి చూపుతున్నారు.

This Is How The Bahubali Fame Actor Prabhas Earns For His Incredible Work,  Take A Look | IWMBuzz

ఈ ఆదర్శకుల లిస్టులోకే తాజాగా వచ్చిన బింబిసార‌ సినిమా డైలాగ్ రైటర్ వాసుదేవ్ కూడా చేరారు.. ప్రభాస్ తో సినిమా చేయడమే తన డ్రీమ్ అని చెప్పారు. ప్రభాస్ ప్రస్తుతం సలార్- ఆదిపుష్- ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తున్నారు. ఇదే క్రమంలో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా కూడా చేయాలి. తాజా ఇంటర్వ్యూలో వాసుదేవ్ మాట్లాడుతూ… ప్రభాస్ తో సినిమా చేయడానికి నా దగ్గర ఆల్రెడీ స్టోరీ కూడా ఉందని… ఆ స్టోరీకి ప్రభాస్ సూట్ అవుతాడ‌ని చెప్పారు.

స్వాతంత్ర సమరయోధుడు లో భగత్ సింగ్ అంటే వాసుదేవ్ కి చాలా ఇష్టమట.ఇందులో భగత్ సింగ్ చనిపోయిన నేపథ్యంలో జరిగిన సంఘటనలు ఆధారంగా ప్రభాస్ సినిమా ఉంటుంద‌ని వాసుదేవ్ చెప్పారు. భగత్ సింగ్ పాత్రకి ప్రభాస్ సూట్ అవుతారని ఆయన అన్నారు. వాసుదేవ్ చెప్పేది చూస్తుంటే ప్రభాస్ అభిమానులకు మరోసారి బాహుబలి లాంటి హిట్, కన్నీళ్లు గ్యారంటీ అని తెలుస్తుంది. భ‌గ‌త్ సింగ్‌ పేరు చెప్తేనే మనకి నరాలు నిక్కబొడుస్తాయి.. ఆయన మరణంతో సినిమా అంటేనే ప్రతి ఒక్కరికి ఎమోషనల్ గా ఉంటుంది.

20 Things You Should Know About Bhagat Singh - India Will Never Forget This  Dropout's Sacrifice!

ఇక తాను ఏ సినిమా చేసిన బింబిసారా2 తర్వాతే చేస్తానని కూడా వాసుదేవ్ క్లారిటీ ఇచ్చాడు. బింబిసార 2 స్టోరీ చర్చలు జరుగుతున్నాయని… తాను కళ్యాణ్ రామ్ గారి పిల్లలకు ట్యూషన్ కి చెపుతూ ఆయన దృష్టిలో పడ‌డంతో… ఆయన నామీద నమ్మకంతో బింబిసారా కు డైలాగులు రాయడానికి అవకాశం ఇచ్చారని చెప్పాడు. బింబిసారా సూపర్ హిట్ తో ఆయ‌న న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌లేద‌ని.. ఇప్పుడు బింబిసార 2 కోసం మాపై మ‌రింత బాధ్య‌త పెరిగింద‌ని చెప్పాడు. మ‌రి ప్ర‌భాస్‌ను డైరెక్ట్ చేయాల‌న్న వాసుదేవ్ కోరిక ఎప్పుడు తీరుతుందో ? చూడాలి.

Share post:

Latest