మరికొద్ది గంటల్లో సినిమా రిలీజ్.. సీతారామంకు భారీ షాక్..!!

సినిమా ఇండస్ట్రీ అంటే ఓ మాయా ప్రపంచం అని ఊరికే అనలేదు సినీ ప్రముఖులు. ఇక్కడ జరిగేవి అన్ని కళ్ల ముందే జరుగుతున్నా..కానీ, ఏం జరగన్నట్లే ఉంట్లుంది. లేకపోతే..రిలీజ్ కు కొన్ని గంటల ముందు సినిమాని బ్యాన్ చేయాలి అని అనడం న్యాయమా..? ఈ సినిమా నిర్మాతలు ఏం అవ్వాలి..? డబ్బులు పోసి కొనుకున్న డిస్ట్రీబ్యూటర్లు ఏం అవ్వాలి..? ఇప్పుడు ఇదే విధంగా ప్రశ్నిస్తున్నారు సీతారామం మూవీ టీం సభ్యులు. మనకు తెలిసిందే..రేపు భారీ రేంజ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.


రేపు విడుదల కానున్న సీతారామం సినిమాకి భారీ షాక్ తగిలింది. మహానటి ఫేమ్ దుల్కర్ సల్మాన్ హీరోగా, అందాల భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా.. జంటగా నటించిన సినిమానే ఈ సీతారామం. ఈ సినిమాని వైజయంతి మూవీస్ సమర్పణల్లో అశ్విని దత్ నిర్మిస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం సినిమా కి మరో ప్లస్ పాయింట్. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సమయంలోనే ఈ సినిమాకు సంబంధించిన షాకింగ్ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం సంచలనం గా మారింది.


ఈ సినిమాకి సెన్సార్ బోర్డు నుంచి భారీ షాక్ తగిలిందని వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాను గల్ఫ్ దేశాలు రిలీజ్ చేయడానికి సెన్సార్ బోర్డ్ నో చెప్పినట్టు తెలుస్తుంది.దానికి కారణం లేకపోను లేదు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు మతపరమైన అంశాలతో కూడి ఉన్నాయని, అందువల్లే ఈ సినిమాను గ‌ల్ఫ్‌ దేశాల్లో రిలీజ్ చేయవద్దు అంటూ సెన్సార్ బోర్డ్ ఆదేశించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, చిత్ర యూనిట్ఈ సినిమాను ఎలాగైనా గ‌ల్ఫ్ దేశ‌లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి సెన్సార్ బోర్డు ముందుకు వెళ్లనుందట.

మరి నిజంగానే సెన్సార్ బోర్డ్ గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రాన్ని బ్యాన్ చేస్తారా? లేదా ఈ సినిమాలో ఉన్న అభ్యంతర సన్నివేశాలు తొలగించి రిలీజ్ చేస్తారా..? అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, టీజర్ ,టైలర్ ప్రేక్షకులను బాగా మెప్పించాయి. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ కూడా వస్తుంది. నిన్న జరిగిన ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు పాన్ ఇండియా హీరో ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.