ఎప్పటికైనా తన తండ్రి ఎన్టీఆర్ కోరికను తీరుస్తానంటున్న బాలయ్య..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. బాక్సాఫీస్ వద్ద కోట్లు కలెక్షన్ రాబడుతూ సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారు బాలయ్య. ఇక ఎలాంటి పాత్ర అయినా సరే చేస్తూ ఎంతోమందికి ఆశ్చర్యాన్ని కలిగించడంతోపాటు ఆదర్శంగా నిలుస్తున్న బాలయ్య ఎప్పుడు కూడా తన తండ్రి స్మరణ చేస్తూ ఉంటారనటంలో సందేహం లేదు. ఇప్పటికే ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా బాలయ్యకు తన తండ్రి అంటే ఇష్టము అని కనీసం రోజులో వందసార్లు అయినా సరే తన తండ్రి పేరు తలుస్తూ ఉంటారు అని సమాచారం. ఇకపోతే ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. కానీ ఆ కోరికను తీర్చుకోలేని సందర్భాలలో తమ వారసుల ద్వారా తీర్చుకుంటూ ఉంటారు.ఈ క్రమంలోనే తన తండ్రి ఎన్టీఆర్ తీర్చుకోలేని కోరికను ఎప్పటికైనా సరే తీరుస్తానని బాలయ్య మాట ఇచ్చారు.Balayya Birthday SPL: Checkout Rare Pics Of Nandamuri Balakrishnaఇక అసలు విషయంలోకి వెళితే.. సీనియర్ ఎన్టీఆర్ తన కెరియర్ లో ఎన్నో చిత్రాలలో నటించారు. అయితే కొన్ని పాత్రలో నటించాలని భావించినప్పటికీ రాజకీయాల కారణంగా బిజీగా ఉండడంతో ఇది సాధ్యపడలేదు.ముఖ్యంగా అందులో రామానుజాచార్యుల జీవిత కథ కూడా ఒకటి. ఎప్పటికైనా సరే ఈ పాత్రలో నటించాలని ఎన్టీఆర్ అనుకున్నప్పటికీ ఆయన బిజీ షెడ్యూల్ వల్ల సాధ్యపడలేదు. ఇక సమయం దొరికి ఖాళీగా ఉన్నప్పుడు నటించాలనుకుంటే అనారోగ్యం బారినపడి స్వర్గస్తులయ్యారు. ఇక అలా ఆయన కోరిక కోరికగానే మిగిలిపోయింది. అందుకే బాలకృష్ణ ఎప్పటికైనా సరే తన తండ్రి నటించలేని ఆ చిత్రాలలోనటిస్తానని తెలియజేశాడు. ముఖ్యంగా పంచాక్షరి మంత్రం అందరికీ ఉపదేశించే రామానుజాచార్య పాత్రలో తాను నటిస్తానని తన తండ్రి కోరిక తీరుస్తానని.. ఇక అది నా బాధ్యత అంటూ బాలయ్య వెల్లడించారు. ఇక బాలయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆయన అభిమానుల సైతం అంటూ ఉండడం గమనార్హం.Ramanujacharyulu: ఎవరీ రామానుజాచార్యులు.. ఆయన ఏం చేశారు?

- Advertisement -

బాలకృష్ణ కూడా ప్రస్తుతం వరుస సినిమాలు, రాజకీయాలలో బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఇక తన తండ్రి కోరిక మేరకు ఎలాగైనా సరే రామానుజాచారి పాత్రలో నటించి.. తండ్రి చివరి కోరికను తీరుస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Share post:

Popular