బాలయ్యకి నటనకి 48 ఏళ్ళు… త్వరలో ఆ సినిమాని రీ రిలీజ్ చేయనున్నారా?

నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. అభిమానులు అతన్ని ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటూ వుంటారు. మాస్ యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు నందమూరి బాలయ్య. ఫ్యాక్షన్ సినిమాలకు ఆయన ఓ ట్రెండ్ సెట్టర్. బాలకృష్ణ కత్తి పట్టినా.. డైలాగ్ చెప్పినా.. తొడగొట్టినా.. థియేటర్ లో స్పీకర్లు పగిలిపోవాల్సిందే. ఇకపోతే ఈయన సినిమా ప్రయాణం మొదలు పెట్టి 48 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈయన నట ప్రస్థానంపై ఓ లుక్కేద్దాము.

48 ఏళ్ల క్రితం అంటే 14 ఏళ్ల వయసులో తన తండ్రి NTR స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తాతమ్మ కల’ సినిమాతో బాలయ్య నటుడిగా తన ప్రయాణం మొదలు పెట్టాడు. ఈ 48 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో విజయాలు అందుకున్నారు. అలాగే అపజయాలు చూశారు. దశాబ్దాలుగా… కమర్షియల్ సినిమాకి కేరాఫ్ అడ్రస్ అతనే. ఇపుడు మరోసారి ఫ్యాక్షన్ లీడర్‌గా పలకరించబోతున్నారు. ఇపుడు అతని వయస్సు 62. అయినా పాతికేళ్ల యువకుడిలాగా అతను ఎంతో ఉత్సాహంతో ఉంటాడు. ఇటీవల aha OTTలో టెలికాస్ట్ అయిన షో ‘Unstoppable’ చూసిన ఎవరికైనా అర్ధం అవుతుంది… బాలయ్య జోష్ ఏమిటో.

48 ఏళ్ల సినీ జీవితంలో 106 సినిమాల్లో బాలయ్య విజయవంతంగా యాక్ట్ చేశారు. ఈయన సినిమాలు రూ. 10 లక్షల నుంచి రూ. 200 కోట్ల వరకు వసూళ్లను సాధించాయి. 1960 జూన్ 10న నందమూరి బసవ తారకం, నందమూరి తారక రామారావు ఎనిమిదో సంతానంగా జన్మించిన బాలకృష్ణ. ఎన్టీఆర్‌ దంపతులకు ఆరో కొడుకు. బాలయ్య జీవితంలో చెప్పుకోదగ్గ సినిమాలు మంగమ్మగారి మనవడు, భైరవద్వీపం, ఆదిత్య 369, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా, లెజెండ్, అఖండ… ఇలా ఈ లిస్టు పెద్దగానే ఉంటుంది. ఇక బాలకృష్ణ కెరీర్ 48 పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సమరసింహారెడ్డి’ అనే సినిమాని రీరిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. కాబట్టి అభిమానులు మరలా పండగ చేసుకొనే సమయం వచ్చేసింది.

Share post:

Latest