లైగర్ హిట్ కోసం లక్కి హీరోయిన్ ని రంగంలోకి దించిన పూరి..సూపరో సూపర్..!?

ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు? ఏ హీరోయిన్ వచ్చి ఏం చెప్తే జనాలు అట్రాక్ట్ అవుతారో మాత్రం పూరీకి బాగా తెలుసు. అందుకే తన హిట్ హీరోయిన్ ని లైగర్ కోసం రంగలోకి దించాడు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన సినిమా ప్రమోషన్స్ కోసం ఓ స్టార్ హీరోయిన్ ని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ క్రేజీయస్ట్ యాటిట్యూడ్ హీరో విజయ్ దేవరకొండ.. బాలీవుడ్ స్టార్ డాటర్ అనన్య పాండే కలిసి ఓ రేంజ్ లో రొమాన్స్ చేసిన చిత్రమే లైగర్. ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తన ఆశలన్నీ తన కష్టాని అంతా ధారపోసి డైరెక్ట్ చేసి,, నిర్మించాడు పూరీ జగన్నాథ్.


ఇన్నాళ్ల లైగర్ ప్రమోషన్స్ పనులు ఎలా ఉన్నా.. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. బిగ్ బిగ్ స్టార్స్ కూడా లైగర్ సినిమా పై స్పందించడం ఆశ్చర్యం కలిగిస్తుంది . ఎందుకంటే ఇన్నాళ్లు ఈ సినిమాపై స్పందించని హీరోయిన్ అనుష్క శెట్టి కూడా ఇప్పుడు లైగర్ సినిమా గురించి మాట్లాడడం ఇండస్ట్రీలో కొత్త అర్ధాలకు దారితీస్తుంది. కేవలం రెండు రోజులు రెండంటే రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆగస్టు 25న గ్రాండ్ గా పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది . ఇప్పటికి ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పనులన్నీ పూర్తి చేసుకున్నాడు పూరి జగన్నాథ్. మరీ ముఖ్యంగా లైగర్ ప్రమోషన్స్ పనులను దగ్గరుండి చూసుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ.

అయితే కొద్దిసేపటి క్రితమే హీరోయిన్ అనుష్క శెట్టి లైగర్ టీంకు బెస్ట్ విషెస్ అందించారు. లైగర్ సినిమా హిట్ అవ్వాలని ఇంస్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ..” లైగర్ యూనిట్ కు ఆల్ దిబెస్ట్ చెప్పారు. సినిమా కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని.. కచ్చితంగా ఈ సినిమా పూరి జగన్నాథ్ కి మంచి కమ్ బ్యాక్ ఇస్తుందని,, పూరి జగన్నాథ్ మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను”.. అని చెప్పుకొచ్చింది. అంతేనా పూరి జగన్నాధకు కొత్త పేరు పెట్టింది.

ఇప్పుడు పూరి జగన్నాథ్ పేరు ఏంటో తెలుసా..” జగ్గు దాదా” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ జగ్గు దాదా ట్రెండింగ్ లోకి వచ్చాయి. ప్రస్తుతం అనుష్క పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా కొందరు పూరి జగన్నాథ్ అనుష్కను ఇలా పెట్టమని చెప్పారని అంటున్నారు. ఎందుకంటే ఇన్నాళ్లు స్పందించని అనుష్క రెండు రోజుల ముందు స్పందించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతేకాదు అనుష్క పూరి జగన్నాథ్ కి అనుష్క ఎంత లక్కీ హీరోయిన్ అనేది ప్రత్యేకించి చెప్పాలా..?

Share post:

Latest