ఇంట్రెస్టింగ్: అనుపమ కెరీర్ తలకిందులు చేసిన ఒక్కే ఒక్క ఫోటో ఇదే..!!

నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అ ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు అనుపమ పరమేశ్వరన్ పరిచయమైంది. ఈ మలయాళీ భామ అంతకుముందు మలయాళీ ప్రేమమ్‌ సినిమాలో నటించి మెప్పించింది. అదే సినిమాను తెలుగులో నాగచైతన్య హీరోగా రీమేక్ చేయగా అందులోను అనుపమ త‌న క్యూట్ లుక్స్‌తో తెలుగు యూత్‌ను ప‌డేసింది. ఈ రెండు సినిమాలు హిట్ అవ్వటంతో తర్వాత అనుపమకు ఆఫర్లు వెల్లువ‌లా వచ్చాయి.

Anupama Parameswaran HQ Wallpapers | Anupama Parameswaran Wallpapers - 42019 - Oneindia Wallpapers

ఈ అందాల భామ ఇప్పుడు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తెలుగులోనే కాకుండా తమిళ్ లోను ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తుంది. తాజాగా కార్తీకేయ 2 సినిమాలో న‌టించి సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో ఆసక్తికర విషయాలు చెప్పింది. తాను సినిమా ఇండస్ట్రీ లోకి ఎలా వచ్చానో ? తన సినిమా కెరియర్ ఎప్పుడు మొదలైందో అని విషయాలు చెప్పింది. అనుపమ 18వ యేట‌ ప్రేమమ్ సినిమాలో నటించింది. ఆ సినిమా నుంచి ఇప్పటివరకు ఈమె 19 సినిమాల్లో నటించగా… మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి.

അനുപമ പരമേശ്വരന്റെ സ്റ്റൈൽ സ്റ്റേറ്റ്മെന്റ് | Anupama Parameswaran | Style Statement | Premam | Hair Care |

తాజాగా అనుపమ మాట్లాడుతూ తన కాలేజీలో చదువుకున్న రోజుల్లో తన స్నేహితులు తన ఫోటోలు ఆడిషన్స్‌కు పంపగా ఆ ఫోటో ద్వారా తనకు సినిమా ఛాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చింది. తెలుగులో నటించిన సినిమాలతో తనకు మంచిగు గుర్తింపు వచ్చిందని.. శతమానం భవతి సినిమా నా కెరియర్ మరో లెవల్ కి తిసుకువెళింద‌ని చెప్పుకొచ్చింది. తాజాగా వచ్చిన కార్తికేయ 2 సినిమా తన జీవితంలో నిలిచిపోయే సినిమా అని గర్వంగా చెప్పుకొచ్చింది.

Share post:

Latest