తిరుగుబాటు: వైసీపీలో మరో రెబల్?

అధికార వైసీపీలో ఈ మధ్య రెబల్ నాయకులు పెరుగుతున్నారు…అంటే తమ సొంత ప్రభుత్వంపై ఉన్న సంతృప్తి కావొచ్చు….తమ అధిష్టానంపై ఉన్న అసంతృప్తి కావొచ్చు..లేదా తాము ఎమ్మెల్యేగా ఉన్న సరే…కేవలం నిమిత్తమాత్రులుగానే మిగిలిపోతున్నామనే భయం కావొచ్చు…కారణాలు ఏదైనా గాని..ఈ మధ్య సొంత పార్టీకి వ్యతిరేకంగా పలువురు గళం విప్పుతున్నారు. అలాగే పార్టీలో జరిగే అంతర్గత పోరులని కూడా బయటపెడుతున్నారు.

ఇప్పటికే ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసీపీలో రెబల్ గా తయారయ్యి…అదే పార్టీపై నిత్యం విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే…అయితే వైసీపీ కూడా ఆయనకు చెక్ పెట్టడానికి గట్టిగానే ట్రై చేస్తుంది. రఘురామ విషయం పక్కన పెడితే..ఆయన తర్వాత పలువురు ఎమ్మెల్యేలు…సొంత పార్టీ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఆనం రామ్ నారాయణ రెడ్డి సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేశారు. అటు కోటగిరి శ్రీధర్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు పార్టీలో ఉన్న కొందరు నేతలపై ఫైర్ అయ్యారు.

ఇక ఆ మధ్య దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్..అన్నీ జగన్ ఇస్తే తమ గ్రాఫ్ ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వాలని కోరారు. అయితే ఇలా ఎక్కడకక్కడ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు అసంతృప్తి పెరిగిపోతూ వస్తుంది. పథకాలు ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేసేది వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది…డబ్బులు ఇచ్చేది జగన్…మధ్యలో ఎమ్మెల్యేలు బలి అవుతున్నారు. పైగా పథకాలకు డబ్బులు ఇస్తున్నారు గాని , అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం తక్కువ. దీంతో ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరుగుతుంది.

ఇదే క్రమంలో తాజాగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు…సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెన్షన్ తీసుకునే సామాన్యుడు ఇన్‌కమ్ టాక్స్ కట్టగలడా? అని ప్రశ్నించారు. పార్టీ లేదు గాడిద గుడ్డు లేదు.. ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరికీ తెలుసు? అని, తాను వైసీపీలో శాశ్వతమా?.. రేపన్న రోజు ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తెలియదని అని షాక్ ఇచ్చారు. చంటిబాబు గతంలో టీడీపీలో పనిచేసిన విషయం తెలిసిందే…2019 ఎన్నికల ముందే ఆయన వైసీపీలోకి వచ్చి పోటీ చేసి గెలిచారు. మరి అలాంటి నేత ఇప్పుడు సడన్ గా ఇలా మాట్లాడుతుండటంతో…చంటిబాబు ఏమన్నా వైసీపీకి షాక్ ఇవ్వబోతున్నారా?అనే డౌట్ కూడా వస్తుంది. చూడాలి మరి చంటిబాబు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటారో.

Share post:

Latest