తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ అమలాపాల్ బాగా సుపరిచితమే. ఎప్పుడూ కూడా తనదైన శైలిలో స్పందిస్తూ పలు వివాదాలలో చిక్కుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా విల్లుపురం పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. తన మాజీ ప్రియుడు పవీందర్ సింగ్ . బెదిరిస్తున్నట్లుగా ఫిర్యాదులు తెలియజేయడం జరిగింది. దీంతో ఆమె మాజీ ప్రియుడు పై సెక్షన్ 16 కింద కేసు నమోదు చేసి అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.ఇక అతనితోపాటు పోలీసులు మరి కొంతమంది కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు వివరాల్లోకి వెళితే 2018లో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి ఆ తర్వాత జిల్లాలోని అరోబిల్ సమీపంలో పెరియముదలియార్ చావడికి మార్చారు. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్తా వివాహం వరకు దారితీసింది. ఈ క్రమంలోనే నిర్మాణ సంస్థ లావాదేవీలు వీరిద్దరి మధ్య పలు విభేదాలు రావడంతో.. పవిందర్ సింగ్, అమలాపాల్ విడిపోవడం జరిగిందట. ఇక అంతే కాకుండా తనకి ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వకపోగా తన మాట వినకపోయినా ఆమెకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడట.
దీంతో ఆమె నిర్మాణ సంస్థ పై డైరెక్ట్ గా అమలాపాల్ పేరును తొలగిస్తూ నకిలీ పత్రాలు సృష్టించి మోసం చేశాడని పవిందర్ సింగ్ మిత్రులు కూడా తనని లైంగికంగా వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులో తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ ని వివాహం చేసుకొని అతనితో కూడా కొన్ని కారణాల చేత విడిపోవడం జరిగింది అమలాపాల్. ప్రస్తుతం పలు యాక్షన్ సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నది.
మాజీ ప్రియుడు చేతులో అమలాపాల్ లైంగిక వేధింపులు..!!
