20 ఏళ్ల సంపాద‌నంతా లైగ‌ర్ దెబ్బ‌తో హుష్‌కాకి… క‌క్క‌లేక మింగ‌లేక ఛార్మీ …!

ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా అందరి నోట వినిపిస్తున్న మాట లైగర్. ఈ చిత్రం ఎలా ఉంది అనే చర్చ ఇంకా ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నది. ఈ సినిమా గోర పరాజయం అయినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయంపై ఇప్పుడు ఎక్కువగా చర్చ కొనసాగుతూ ఉండడం గమనార్హం. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ ఒక రేంజ్ లో చేశారు కానీ సినిమా విడుదలైన తర్వాత సోషల్ మీడియా చేతిలో ట్రొల్ అయ్యే పరిస్థితి ఏర్పడింది ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్ అవుతూనే ఉన్నాయి. ఇక లైగర్ కూడా ఆ లిస్టులో చేరడంతో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ కు కూడా గట్టి షాక్ తగిలిందని చెప్పవచ్చు..Is this Liger story?వాస్తవానికి లైగర్ సినిమా ప్రమోషన్స్ ను ఓ రేంజ్ లో చేయడంతో మరింత ట్రోల్ గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. థియేటర్ల ముందు జనాలు మొహం మీదే చెత్త సినిమా అని చెప్పడంతో పాటుగా ఎక్కువ రోజులు ఈ సినిమా థియేటర్లలో ఆడే పరిస్థితి లేదని కూడా తెలియజేస్తున్నారు. ఈ సినిమాకి బాలీవుడ్లో కరణ్ జోహార్ సహనిర్మాతగా కూడా వ్యవహరించారు. తెలుగులో ఛార్మి, పూరి జగన్నాథ్ నిర్మాతలుగా వ్యవహరించారు.Liger: Charmi Who Broke Down In Tears In The Interview.. If He Wasn't  There..!ఇక ఈ చిత్ర ప్రభావం పూరి జగన్నాథ్ పైన తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు..ఒకవైపు పూరి జగన్నాథ పై ఎక్కువ నమ్మకం పెట్టుకోవడంతో ఛార్మి నిండా మునిగిపోయింది అనే వార్తలు కూడా మళ్లీ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా విడుదలైన మొదటి షో తోనే ఫలితం ఏంటన్న విషయం తెలియడంతో ఛార్మి తన సన్నిహితుల దగ్గర చాలా ఎమోషనల్ అయినట్లు సమాచారం. ఈ సినిమా వల్ల దాదాపుగా ఈమె రూ. 200 కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్లు సమాచారం. తను 20 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉంటూ చాలా కష్టపడి ఆస్తులను కూడబెట్టి.. లైగర్ సినిమా కి పెట్టుబడి పెట్టడంతో పూర్తిగా కోల్పోయినట్లు తన సన్నిహితులతో చెప్పి బాధపడినట్లు సమాచారం.. మరి నిర్మాతగా తెరకెక్కిస్తున్న తన తదుపరిచిత్రమైన జనగణమన సినిమా పైన ఈ ప్రభావం చూపే అవకాశం ఉంటుందేమో చూడాలి.