సౌందర్యను చూసిన తర్వాత ఎప్పుడూ ఆ పని చేయకూడదనుకున్నా.. రాజా రవీంద్ర..!!

ప్రముఖ నటుడిగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , విలన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న వారిలో రాజా రవీంద్ర కూడా ఒకరు . నటుడు మాత్రమే కాదు ఎంతో మంది స్టార్ హీరోలకు మేనేజర్ గా కూడా పనిచేశారు. రవితేజ లాంటి స్టార్ హీరోలు కూడా రాజా రవీంద్ర వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారటంలో సందేహం లేదు. ఎందుకంటే రవితేజ ఒప్పుకునే ఏ సినిమా కైనా సరే డేట్స్ అడ్జస్ట్ చేయిస్తూ చాలా చక్కగా రవితేజను గైడ్ చేస్తూ వచ్చాడు. అందుకే ఈరోజు స్టార్ పొజిషన్లో రవితేజ ఒక వెలుగు వెలుగుతున్నారని చెప్పవచ్చు. రాజా రవీంద్ర మొదట హీరోగా చేసిన కొన్ని సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఇప్పటికీ కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలలో నటిస్తూ మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.12 yrs after death, Soundarya wins caseఅంతేకాదు పర్సనల్ మేనేజర్ గా.. జయసుధ, నిఖిల్, నవీన్ చంద్ర , మంచు విష్ణు, రాజ్ తరుణ్ వంటి వారికి కూడా డేట్స్ చూసుకుంటూ ఉండేవారు.. హీరోల సినిమా డేట్స్ మ్యానేజ్ చేసే రాజా రవీంద్ర హీరోయిన్లకు ఎందుకు మేనేజర్ గా పని చేయడం లేదు అని.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ సౌందర్యాని చూసిన తర్వాతనే హీరోయిన్లకు మేనేజర్ గా పనిచేయకూడదు అనే నిర్ణయం తీసుకున్నాను అంటూ వెల్లడించారు.. ఇక అసలు విషయం ఏమిటంటే.. స్టార్ హీరోలు ఒకే సమయంలో ఒకటి రెండు సినిమాల కంటే మించి చేయరు. కానీ హీరోయిన్ లు అలా కాదు.. ఒకే సమయంలో పలు భాషలలో నాలుగైదు సినిమాల్లో చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంటారు. ఇక వారి డేట్స్ అడ్జస్ట్ చేయాలి అంటే సాహసంతో కూడుకున్న పని..Raja Ravindra movies, photos and other details | Clapnumberఒకానొక సందర్భంలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సౌందర్య ఒకేసారి మూడు నాలుగు సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా ఏకాకాలంలో హిందీలో అమితాబ్ బచ్చన్ సినిమాలో, తెలుగులో చిరంజీవి అన్నయ్య సినిమాతో, తమిళంలో రజనీకాంత్ సినిమాలో కూడా నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక అదే సమయంలో డేట్స్ సరిగ్గా అడ్జస్ట్ చేయలేక ఆమె మేనేజర్ పడ్డ కష్టాలు అంతా ఇంతా కాదు. ఒకసారి ఫ్లైట్ కూడా మొరాయించడంతో రజినీకాంత్ సినిమా షూటింగుకి సౌందర్య హాజర కాలేకపోయారు. ఆ సమయంలో సౌందర్య మేనేజర్ టెన్షన్ చూసి నాకు భయమేసింది.. అందుకే భవిష్యత్తులో హీరోయిన్లకు మేనేజర్ గా పనిచేయకూడదు అని నిర్ణయం తీసుకున్నాను అంటూ రాజా రవీంద్ర వెల్లడించారు.

Share post:

Latest