సినిమాల వలన హీరోయిన్ తమన్నా అంతలా సంపాదించిందా? వజ్రాల మూట కూడా వుందా?

టాలీవుడ్ యాక్ట్రెస్ తమన్నా పరిచయం నేటి కుర్రకారుకి అవసరం లేదు. ఆమె అందం, అభినయం గురించి అందరికీ తెలిసిందే. ఇకపోతే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్ళు పూర్తైన సందర్భంగా ఆమె గురించి ఓ విషయం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. దాదాపు 50కి పైగా సినిమాల్లో న‌టించిన త‌మ‌న్నా తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతున్నారు. తాజాగా ఎఫ్ 3 సినిమాతో తెలుగు కుర్రాళ్లకు కితకితలు పెట్టింది. అదలా ఉంచితే ఇండస్ట్రీకి వచ్చిన ఇన్నేళ్లలో తమన్నా ఆస్తి ఎన్ని కోట్లు సంపాదించి ఉంటుందో అని చర్చించుకుంటున్నారు ఆమె అభిమానులు.

ఈ మిల్కీ బ్యూటీ ఆస్తులు అంతస్తుల గురించి మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమన్నాకు ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన జుహూలో రూ.16.60 కోట్ల ఖరీదైన అపార్ట్మెంట్ ఉందట. దీని విస్తీర్ణం 80,778 చదరపు అడుగులు ఉంటుందట. ఇక తమన్నా ఆస్తి మొత్తం రూ.150 కోట్లకు పైగానే ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆమెకు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ రూ.75.59 లక్షలు కాగా బీఎండబ్ల్యూ 320 ఐ – రూ.43.50 లక్షలు.. మెర్సిడేస్ బెంజ్ జి ఎల్ ఈ రూ.1.02 కోట్లు.. మిత్సు బిషి పేజర్ స్పోర్ట్స్ కార్ రూ.29.96 లక్షలు ఉన్నాయట.

వీటితో పాటు తమన్నా దగ్గర ప్రపంచంలోనే 5వ అతిపెద్ద వజ్రం అనబడిన ఓ వజ్రం ఉందని తెలుస్తోంది. ఇక దీని విలువ రెండు కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంటున్నారు. ఈ వజ్రాన్ని రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఆమెకు బహుమతిగా ఇచ్చారని టాక్. ప్రసుతం దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ టాపిక్ నడుస్తోంది. ఇక చిరంజీవి హీరోగా మెహెర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమాను చేస్తున్నారు.. భోళా శంకర్ తమిళ వేదాళం‌కు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా చేస్తోందన్న సంగతి విదితమే.

Share post:

Latest