నటి సంచలన వ్యాఖ్యలు… హీరో అర్జున్ వలనే అవకాశాలు రావడం లేదని ఆరోపణ?

గత కొన్నాళ్లుగా పలు సినిమా పరిశ్రమలనుండి వినబడుతున్న వివాదాస్పద పదం క్యాస్టింగ్ కౌచ్. అవును… కొందరు నిర్మాతలు, దర్శకులు, నటుల పేర్లు ఇందులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇకపొతే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో యాక్షన్ కింగ్ గా పేరుపొందిన కన్నడ నటుడు హీరో అర్జున్. అతని గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. ఇకపోతే నటుడు అర్జున్ యాక్షన్ చిత్రాలలో మాత్రమే కాకుండా తెలుగులో హీరోగా నటించిన “పుట్టింటికి రా చెల్లి” చిత్రంతో సెంటిమెంటల్ సన్నివేశాలను కూడా బాగా పండించగలడని నిరూపించుకున్నాడు.

ఇకపోతే అర్జున్ ఈ మధ్య కాలంలో పలు నెగటివ్ ఓరియెంటెడ్ పాత్రలలో కూడా నటిస్తూ బాగానే ఆకట్టుకుంటున్నాడు. దీంతో ప్రస్తుతం తెలుగు తమిళం మలయాళం కన్నడ తదితర భాషలలో వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే మనోడిపైన క్యాస్టింగ్ కౌచ్ ముద్ర పడింది. దానికి కారణం కన్నడ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోయిన్ శృతి హరిహరన్. అవును… హీరో అర్జున్ తో కలిసి ఓ చిత్రంలో పనిచేస్తున్నప్పుడు హీరో అర్జున్ తనని లైంగికంగా వేధించాడని క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. ఈ సంగతి అప్పట్లో కన్నడ చలనచిత్ర పరిశ్రమలో పెను దుమారాన్నే సృష్టించింది.

ఇక ఆ విషయం కాస్త కొన్నాళ్ల తరువాత సద్దుమణగడంతో దాదాపు ఆ విషయాన్ని ఇపుడు మెల్లగా మర్చిపోయారు. ఇలాంటి తరుణంలో ఆమె మరలా ఆటగాడిపైన చేస్తున్న ఆరోపణలు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్నాయి. విషయం ఏమంటే… అలా హీరో అర్జునపైన ఆరోపణలు చేసిననాటినుండి అమ్మడుకి అక్కడ సినిమా అవకాశాలు కరువయ్యాయట. ఇటీవల ఓ మీడియా వేదికగా మాట్లాడిన తను ఈ రకమైన ఆరోపణలు చేసింది. కాగా ఈ విషయంపట్ల అర్జున్ అభిమానులు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.

Share post:

Latest