పుష్ప 2లో సాయిపల్లవి కూడా వుండబోతుందా? ఇదిగో క్లారిటీ!

ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన అల్లు అర్జున్ సినిమా పుష్ప బాక్సాఫీస్‌ దగ్గర ఎలాంటి మేజిక్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇటు టాలీవుడ్లో అటు బాలీవుడ్లో బంపర్ హిట్ కావడంతో పార్ట్ టూపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. రీసెంట్ గానే పూజా కార్యక్రమం జరుపుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ… సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ మీ మించి ఉంటుందని అంచనాలు పెంచేసిన విషయం తెలిసినదే.

ఇకపోతే ఈ నేపథ్యంలో మరో వార్త కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అవును… ఓ న్యూస్ పుష్ప టూ పై ఎక్స్‌ పెక్టేషన్స్‌ ని మరింత పెంచేలా ఉన్నాయి. ఈ మూవీలో సాయిపల్లవి ఓ ట్రైబల్ అమ్మాయిగా పదినిమిషాల పాటు కనిపించనుందట. స్క్రీన్ స్పేస్ తక్కువే ఉన్నా.. క్యారెక్టర్‌ ఇంపాక్ట్ మాత్రం బాగా ఉంటుందనీ, అందుకే ఆ పాత్రకి సాయిపల్లవిని ప్రిఫర్ చేస్తున్నారనీ టాక్ వినబడుతోంది. బన్నీ, ఫహద్ ఫజిల్ తో పాటు పుష్ప టూలో విజయ్‌ సేతుపతి కూడా నటిస్తున్నాడంటూ ఇప్పటికే చాలా వార్తలొచ్చాయి.

Share post:

Latest