పెళ్లి గాసిప్స్ పై క్లారిటీ ఇచ్చేసిన నటి పూర్ణ.. ఏమన్నారంటే?

నటి పూర్ణ గురించి అందరికీ తెలిసినదే. మొదట పలు సినిమాల్లో నటించి హోమ్లీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న పూర్ణ ఇపుడు పలు టీవీ షోలలో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఈ మధ్యనే పూర్ణకి పెళ్లి కుదిరినట్టు అధికారికంగా ఓ ప్రకటన వచ్చిన సంగతి విదితమే. UAEకి చెందిన వ్యాపారవేత్త షానిద్‌ అసిఫ్‌ అలీని పూర్ణ పెళ్లి చేసుకోబోతుంది. అసిఫ్‌ అలీ JBS గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలకు CEO, మరియు ఫౌండర్‌. ‘జమా అల్ మెహరి’ అనే సంస్థని కూడా స్థాపించి కొత్త ఆఫీస్ లు ప్రారంభించడానికి కావలసిన సర్వీసులను ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా సెలబ్రిటీలకు UAE వీసాలను కూడా ఏర్పాటు చేస్తుంటాడు.

వీసా ప్రాసెసింగ్‌, ఫ్లైట్‌ టికెటింగ్‌ వంటి సర్వీసులను కూడా షానిద్‌ కంపెనీ ఏర్పాటు చేస్తూ ఉంటుంది. కాజల్‌, ప్రియమణి, ప్రణిత, ఆండ్రియా, లక్ష్మీ, విజయ్‌ సేతుపతి, స్వేతా మీనన్‌, నాజర్‌, అజారుద్దీన్‌ వంటి స్టార్లకు UAE వీసాలను ఏర్పాటు చేశారు. UAE ముస్లిం మత పెద్దలతో కూడా ఈయనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. పూర్ణ కుటుంబంతో ఇతగాడికి ముందు నుండి పరిచయం ఉండడంతో పూర్ణతో వున్న ఫ్రెండ్ షిప్ కాస్త ప్రేమగా మారింది. ఈ మధ్యనే వీరి ఎంగేజ్మెంట్ కేరళలో ఘనంగా జరిగినట్లు ప్రచారం జరిగింది.

ఇక ట్విస్ట్ ఏమంటే, కొద్ది రోజులుగా పూర్ణ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ దర్శకుడితో పూర్ణ ప్రేమలో ఉందని, ఆ కారణంగా వీరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలపై పూర్ణ ఒక్క పోస్ట్ తో క్లారిటీ ఇచ్చింది. షానిద్‌ అసిఫ్‌ అలీతో క్లోజ్ గా ఉన్న ఒక ఫోటోని షేర్ చేసి ‘ఫరెవర్ మైన్’ అంటూ ఓ పోస్ట్ పెట్టింది. అంటే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తలు అన్నీ వట్టి గాసిప్స్ అని తేలిపోయింది.

Share post:

Latest