నటి అంజలి కన్నీళ్లు పెట్టుకుంది… నెటిజన్లు తెగ ఫీల్ అయిపోతున్నారు చూడండి!

అవును. నటి అంజలి కన్నీళ్లు పెట్టుకుంది. రియాల్టీ షోలలో చెప్పే మాటలు కొన్నిసార్లు స్క్రిప్టుకు తగ్గట్లు లేకపోతే ఊరుకోరని అందరికీ తెలిసే ఉంటుంది. అయితే అలాంటి విషయాలు షోలో భాగంగా చెప్పినప్పటికీ.. అలాంటివి సదరు సెలబ్రటీల వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేసే వీలు ఉంటుంది. అయితే అలాంటి షోలలో వారు ఎందుకు పార్టిసిపేట్ చేస్తారు అనే విషయం పక్కన పెడితే.. తాజాగా ఆమె పేరు మీద ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉన్న అమ్మాయి అంజలి అరోరా లా కనిపించటం.. మరో వ్యక్తితో ఆమె సన్నిహితంగా వ్యవహరించటం.. వలన ఆ వీడియో ఇప్పుడు షాకింగ్ గా మారింది.

ఈ వీడియో గురించి కొందరు యూట్యూబర్లు ఆమెను నేరుగా అడుగుతున్నారని, ఇలాంటి వాటిని తట్టుకునే శక్తి తనకు లేదని కన్నీళ్లు పెట్టుకుంది అమ్మడు. ఈ మధ్యన ఈ వైరల్ వీడియో మీద వస్తున్న వ్యాఖ్యలపై తాజాగా అంజలి అరోరా రియాక్ట్ అయ్యారు. ఒక వ్యక్తితో అత్యంత సన్నిహితంగా మెలిగినట్లుగా కనిపిస్తున్న వీడియో తనది కాదని.. అదో ఫేక్ వీడియోగా ఆమె వివరణ ఇచ్చారు. ఎవరు క్రియేట్ చేశారో? ఎందుకు చేశారో తెలీదంటూ ఆమె కన్నీరు మున్నీరు అయింది. అసలు ఆ వీడియో తనది కాదని.. తనకు సంబంధం లేని వీడియోకు తన పేరును చేర్చారని ఆమె వాపోతోంది.

తన పేరు మీద వైరల్ అవుతున్న వీడియో పుణ్యమా అని.. గతంలో తనను మెచ్చుకునే వారు సైతం ఇపుడు నేరుగా ముఖంమీద తిడుతున్నారని వాపోయింది. తనకూ ఒక ఫ్యామిలీ ఉందని.. తమ ఇంట్లో వాళ్లు కూడా వీడియోలు చూస్తారన్న ఆలోచన లేకుండా ఇలాంటివి చేయటం చాలా దారుణమని వాపోయింది. అయితే ఇలాంటివి అరికట్టకపోవడం ఇంకా దారుణమైన అంశమని అన్నారు. కేవలం యూట్యూబ్ వ్యూస్ కోసమే ఇలాంటివి చేస్తున్నారంటూ భోరుమంది.

Share post:

Latest